హెల్మెట్ ధరించాలి సురక్షితంగా ప్రయాణించాలి సీఐ నాగేశ్వరరావు
తిరుమలగిరి 19 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలో వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అన్నారు అరైవ్ ఆలైవ్ ప్రోగ్రాం చివరి రోజు కావడంతో చౌరస్తాలో వాహనదారులచే ప్రమాణస్వీకారం చేయించారు అనంతరం వారు మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగం వంటి నిర్లక్ష్యానికి చెల్లించే మూల్యం వెలకట్టలేనిదన్నారు. జిల్లాలో 2025లో 238 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని, ద్విచక్ర వాహనదారులు తలకు హెల్మెట్, కార్లలో ప్రయాణించే వారు డ్రైవర్‌తోపాటు తోటి ప్రయాణికులు సీట్ బెల్టు తప్పని సరిగా ధరించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణను ప్రతీ పౌరుడు బాధ్యతగా భావించాలన్నారు. రోడ్డుపై వాహనాలు నడిపే సమయంలో మనపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను గుర్తుంచుకోవాలన్నారు.. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్సై వెంకట్ రెడ్డి హెడ్ కానిస్టేబుల్ వెంకన్న, కానిస్టేబుల్స్ సైదులు, రవీందర్ ,అబ్దుల్ ,సలీం ,రమేష్ వాహనదారులు తదితరులు పాల్గొన్నారు...