స్కూల్ డ్రైవర్లకు రహదారి భద్రత పై అవగాహన కార్యక్రమం
జోగులాంబ గద్వాల 18 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ (సీబీఎస్ఈ) స్కూల్ నందు రహదారి భద్రతపై ఇటిక్యాల పోలీసులు నిర్వహించిన "అరైవ్ - అలైవ్" ప్రోగ్రాం లో భాగంగా అల్లంపూర్ సి.ఐ ఇటిక్యాల ఎస్.ఐ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎరవల్లి మండల కేంద్రంలోని: ఈరోజు ఎర్రవల్లి లోని శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ సీబీఎస్ఈ స్కూల్ నందు బస్ డ్రైవర్లకు మరియు క్లీనర్లకు బాధ్యత రహితంగా మీ యొక్క డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలని అలంపూర్ సర్కిల్ సీ.ఐ.ప్రదీప్ కుమార్ తెలియజేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన అలంపూర్ పట్టణ సీఐ...! _ఏ ఒక్క డ్రైవర్ కూడా మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నేరం అందుకుగాను భారీ మూల్యాన్ని చిన్నారుల బంగారు భవిష్యత్తును నాశనం చేసిన వారమవుతామని ఖాకీ చొక్కా అంటేనే కష్టపడటానికి దిశ నిర్దేశం చేసే చొక్కా అని మనమందరం బాధ్యత రహితంగా సమాజ శ్రేయస్సుకు పాటుపడాలని అందుకుగాను సమాజానికి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత మనందరిపై ఉండాలని తెలియజేశారు. చిన్నారుల బంగారు భవిష్యత్తును మీపై ఉంటుంది డ్రైవర్లు క్లీనర్లు మరియు సిబ్బంది చిన్నారులు మీపై ఆధారపడి ఉంటుందని వారి బంగారు భవిష్యత్తును సుఖమయంగా ఉండేటట్లు మనమందరం తోడ్పాటు అందించాలని అందుకు మీరందరూ బాధ్యతను మరవకూడదని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ సుధీర్ కుమార్, అల్లంపూర్ సర్కిల్ సి.ఐ ప్రదీప్ కుమార్, ఇటిక్యాల ఎస్.ఐ కే రవి మరియు పోలీస్ సిబ్బంది డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొన్నారు.