సూర్యాపేటజిల్లా రైతాంగానికి, అన్నదాతలకు సూర్యాపేట జిల్లా పోలీస్ విజ్ఞప్తి
- నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండండి.
- విడి, లూజు విత్తనాలు కొనుగోలు చేయవద్దు.
- అనుమతులు ఉన్న డీలర్ల నుండి, విత్తన దుకాణాల్లో విత్తనాలు కొనాలి.
- గ్రామాలలోకి వచ్చి విత్తనాలు అమ్మే దళారుల వద్ద విత్తనాలు కొనవద్దు.
- నాణ్యతలేని, శుద్ధిచేయని నకిలీ విత్తనాలు అమ్మితే కఠినచర్యలు.
.... సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.
ప్రస్తుతం రుతుపవనాల రాకతో వర్షాలు, చిరుజల్లులు ప్రారంభమయ్యాయి. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లాలోని పత్తి, మిర్చి, వరి సాగు చేస్తున్న రైతులందరికీ పోలీస్ శాఖ తరపున జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు రైతన్నలు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
నకిలీ విత్తనాలకు దూరంగా ఉండండి, అనధికారిక, సర్టిఫైడ్ లేని మరియు ప్యాకింగ్ లేని విత్తనాలను కొనకండి. గ్రామాలలోకి వచ్చి దళారుల వద్ద విడి విత్తనాలు కొనవద్దు అన్నారు. ఇవి వాడటం వల్ల దిగుబడి తగ్గే అవకాశం ఉంది, అంతేకాకుండా రైతులు పడే శ్రమ వృధా అవుతుంది. విత్తనాలను కేవలం ప్రభుత్వం సూచించిన అధీకృత (Authorized) విత్తన దుకాణాల్లోనే కొనుగోలు చేయండి. విత్తనాలు కొన్నప్పుడు రశీదు (Receipt) తప్పనిసరిగా తీసుకోవాలి మరియు దానిని భద్రపరుచుకోవాలి. పంట దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే, విత్తనాలు అమ్మిన వ్యాపారస్తులను ప్రశ్నించడానికి మరియు వ్యవసాయాధికారులను ఆశ్రయించడానికి ఈ రశీదు కీలకం ఉంటుంది. నాణ్యతలేని, శుద్ధిచేయని నకిలీ విత్తనాలు అమ్మవద్దు, అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవు, నకిలీ విత్తనాలను విక్రయించే దళారులు, వ్యాపారులపై విత్తనాల చట్టం మరియు బి.ఎన్.ఎస్ (BNS) ప్రకారం కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసి, వారిని జైలుకు పంపడం జరుగుతుంది అని హెచ్చరించారు. నకిలీ విత్తనాల పట్ల పోలీసు శాఖ నిఘా ఉంచాం
విత్తనాలను లూజుగా బ్యాగులలో అమ్ముతున్న వ్యాపారులపై నిఘా పెట్టడం జరిగింది.
రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా సమస్య తలెత్తినా లేదా నకిలీ విత్తనాలపై సమాచారం ఉన్నా వెంటనే పోలీసులకు డయల్ 100, 112 మరియు సూర్యాపేట జిల్లా కంట్రోల్ రూమ్ 8712686026 కు సమాచారం ఇవ్వాలి, వ్యవసాయాధికారులను సంప్రదించాలని అన్నారు.