సమాజం నిండా విస్తరించిన  అసూయ ద్వే షా లు, అమానవీర సంస్కృతికి  టీవీ ప్రసారాలు సీరియళ్లు కారణమేమో?  

సమాజాన్ని ని ట్ట నిలువునా చీల్చే  ఈ రుగ్మతల పైన ఉక్కు పాదం మోపాల్సిందే.  నూతన సంస్కృతి కోసం  కలిసి పోరాడాల్సిందే!

Mar 19, 2026 - 06:33
 0  1

సమాజంలో  ఇరుగుపొరుగు బావన లతో పాటు  స్నేహ సంబంధాలను కొనసాగించుకోవడం ద్వారా  తోటి మనిషిని సాటి మనిషిగా చూసే మానవ విలువలను మరింత వ్యాప్తి చేస్తూ  ఘర్షణలు, అసూయ ద్వేషాలు,  ఆదిపత్యానికి తా వు లేనటువంటి  నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మనిషి అనాదిగా కోరుకుంటున్నాడు. కానీ  ఎక్కడో ప్రారంభమైనటువంటి అసూయ,  స్వార్థం  కలిసి ఉండకుండా  మనిషిని మనిషిగా చూడకుండా   ఆధిపత్య భావనతో నిత్యం సంఘ ర్శించుకోవడం  నేడు సమాజంలో పరిపాటి అయింది. అది కులాలు, మతాల మధ్యన  మాత్రమే కాకుండా ఒకే కులంలోనూ, కుటుంబంలోనూ, కుటుంబo లోని పౌరుల కలతలకు  కారణం కావడమే  మరింత ఆందోళన కలిగించే విషయం. కుటుంబ సభ్యుల మధ్యన కనీసమైన బందాలు లేకపోవడం,  ఎవరికి వారే అనే ధోరణి,  ఆదిపత్యాన్ని చలాయించడం,  కుటుంబ గౌరవాన్ని నాయకత్వాన్ని సమర్థి o చకపోవడం,  లక్ష్యం ఆదర్శం వంటి విలువలను కనీసం గా పాటించకపోవడం వలన  ఆ ఇంటిలో ఉన్నటువంటి పిల్లలు ఇతర కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ రుగ్మతలు  కామన్ అయిపోయినవి.  తద్వారా భిన్నమైన మనస్తత్వాల మధ్యన  పిల్లల చదువులు, ఉద్యోగాలు,  పని పరిస్థితులు,  పెద్దలను గౌరవించడం చిన్నల ప్రేమించడం వంటి  కనీస లక్షణాలకు కూడా  కుటుంబాలు దూరమవుతున్నటువంటి పరిస్థితులను మనం కళ్లా రా చూడవచ్చు.  సమాజంలో నెలకొన్న పరిస్థితులు కుటుంబం పైన ప్రభావం చూపిస్తే కుటుంబాలలో ఉన్నటువంటి   నూతన పోకడలు కూడా సమాజాన్ని మరింత బ్రష్టు పట్టించడానికి కారణం కావచ్చు కూడా.

ఈ రకమైనటువంటి వైరుధ్యం  పరస్పర సంబంధాలలో ఉన్నటువంటి  అనర్థాలను గ్రహించి తొలినాల్ల లోనే చికిత్స చేయించకపోతే  సమాజం మొత్తము బ్రష్టు పట్టిపోతుంది.  హింసా పూరిత వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి చికిత్స చేయాల్సినటువంటి బాధ్యత బుద్ధి జీవులు,  మేధావులు, విద్యాసంస్థలు,  మీడియా, టీవీ ప్రసారాలు,  సాహిత్యము,  గ్రంధాలయాలు,  వివిధ కళారూపాల పైన ఎంతగానో ఆధారపడి ఉన్నది.

అయితే ఏ సామాజిక బాధ్యత అయితే ఈ కళారూపాలు, సాహిత్యము, మేధావుల పైన ఆధారపడి ఉన్నదని మనం  చెప్పుకుంటున్నామో  ప్రధానంగా అలాంటి బాధ్యతని  టీవీ ప్రసారాలు సీరియళ్లు సెల్ఫోన్ వ్యవస్థ  మరింత బ్రష్టు పట్టించడాన్ని గమనిస్తే  ఈ సాధనాలే ఇవాళ మానవ సమాజాన్ని  నిండా ముంచుతున్నాయని  అర్థం చేసుకోగలము.  ఉత్తమ సాహిత్యం ద్వారా కథలు గాథలు  నాటికలు గేయాలు పాటల ద్వారా  రచయితలు కవులు  తమ పాత్ర పోషిస్తూనే ఉన్నారు.  పాఠశాలల్లో  యాంత్రిక యుగంలో భాగంగా నైతిక విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకుండా సాంకేతిక పరమైన అంశాలకు  ఇతర విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కూడా  కొంత మానవీయ విలువలు కోల్పోతున్న మాట కూడా వాస్తవం.  ఇక టీవీ ప్రసారాలలో సెల్ ఫోన్ వ్యవస్థలో  మొత్తము సామాజిక రుగ్మతలను పెంచి పోషించే అమానవీర సన్నివేశాలు,  మనిషిని మృగాన్ని తయారు చేసేటువంటి సందర్భాలు,  అర్ధ నగ్న దృశ్యాలు,  క్లబ్బులు పబ్బులు ఈవెంట్ కూడా  టీవీలకు సెల్ ఫోన్ లకు తోడు కావడం వలన  మరింత బరితెగించినటువంటి లక్షణాలు చోటు చేసుకుంటున్నాయి.

ఈ కార్యక్రమాలకు ప్రభుత్వాల యొక్క అనుమతి ఉన్న కారణంగా దీనిని ఆపే అధికారం ఎవరికి లేకుండా పోవడంతో ఎవరు బాధ్యులు? ఎవరు బాధితులు? అర్థం కాకుండా పోతున్నది.  అనేక అశ్లీల దృశ్యాలు  సెల్ఫోన్ వ్యవస్థలో  యువతను స్త్రీలను  పురుషులతో సహా సమాజాన్ని మొత్తం ప్రభావితం చేస్తూ  దురలవాట్లు  పారిన పడడానికి ఆస్కారం అవుతుంటే  ఈ విషయాల మీద దృష్టి పెట్టకుండా కేవలం సామాజిక  అశాంతి అనే పేరుతో పోలీసు వ్యవస్థను పురికొ ల్పడం ఎంతవరకు సమంజసం?  పుండు ఒకచోట ఉంటే మందు ఒకచోట పెడితే గాయం నయం అవుతుందా?  విద్యావేత్తలు కూడా తమ బాధ్యతను  నిర్వర్తించే క్రమంలో పాఠ్యాంశాలకు రూపకల్పనలో ప్రధానంగా  నైతిక విద్యకు హెచ్చు ప్రాధాన్యత నివ్వాల్సినటువంటి అవసరం ఉంది. అత్యున్నత స్థాయి తరగతి వరకు కూడా  నైతిక విలువలు ప్రధాన పాత్ర పోషించే విధంగా ఒక  సబ్జెక్టుగా ఉండాలి.

టీవీ ప్రసారాలు, సీరియల్  వ్యవస్థకు వస్తే 

ఒకవైపు అసూయ ద్వే శాలను పెంచి పోషించే  సంభాషణలు సన్నివేశాలతో  కుట్రలు కుతంత్రాలకు ఆజ్యం పోస్తూ ఉంటే  మరొకవైపు అర్థనగ్న దృశ్యాలు,  అంగాంగ ప్రదర్శనలు,  రెచ్చగొట్టే వేషధారణలు, సీరియళ్లు ప్రసారాలలో పెద్ద మొత్తంలో చోటు చేసుకోవడంతో కూడా  అనేక అనర్థాలు బయట జీవితంలో జరగడానికి ఆస్కారం ఉంటుందని అనేకమంది సామాజిక  మనో వైజ్ఞానిక మేధావులు అభిప్రాయపడుతున్నరు.  ఇం కా స్త్రీల పైన అమానవీయ పరిస్థితుల్లో అనే  అనేక చోట్ల అత్యాచారాలు హత్యలు జరుగుతున్న తరుణంలో  పసిపాపల పైన కూడా జరుగుతున్న దాస్టీ కాలకు అంతులేని సందర్భంలో  ఈ రుగ్మతలను  అదుపు చేసే అవకాశం లేకపోవడం విచారకరం." వాళ్లంతా మన తల్లులు చెల్లెలు పిల్లలు అనే భావన గనుక సమాజంలో ఉన్న  సభ్యులందరికీ ఉంటే  ఈ దుర్లక్షణాలను అందరూ ముక్తకంఠంతో ఖండించాలి. ప్రభుత్వాలు కూడా కారణమైనటువంటి వ్యక్తులు వ్యవస్థ లేదా సన్నివేశాలు సంఘటనలను లేదా చెడగొట్టే ప్రచారాలపైన ఉక్కు పాదం మోపగలిగితేనే  ప్రశాంతమైన జీవితం గడపడానికి ఆస్కారం ఉంటుంది.  ఆకాశంలో సగం అని గర్వంగా చెప్పుకుంటున్న మహిళా లోకం   ఆసుపత్రులు పాఠశాలలో ప్రయాణంలో ఎక్కడ కూడా  భద్రంగా జీవితం గడిపే ఆస్కారాలు లేవు.  సామూహిక అత్యాచారం చేసి  దాహం అవుతుంది మంచినీళ్లు కావాలని అంటే ఆ మూర్ఖులు  మూత్రం చేతిలో పోసి తాగుమన్నటువంటి  దుర్మార్గ చరిత్రకు ఒడిగట్టినటువంటి కొంతమంది యువకులు ఉన్నటువంటి దేశం మనది.  అలాంటి వాళ్లు సిగ్గుతో తలవంచుకోవాలంటే  భవిష్యత్తులో సంఘటన జరగకుండా ఉండాలంటే  నేరాన్ని నిర్ధారించి కఠిన శిక్ష అమలు చేయాలి.  ప్రజల సమక్షంలో ఉరి తీయడం,  ఆ నేరస్తుల తల్లిదండ్రులతో మాట్లాడించడం,  సమాజం మద్దతును కూడా కట్టడం చాలా అవసరం.

 
ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని ఒకవైపు బుద్ధి జీవులు మేధావులు ఉపాధ్యాయులు సంఘసంస్కర్తలు సాహితీవేత్తలు కొనసాగించడానికి ఆస్కారం ఉంది.  కానీ అదే సందర్భంలో  అక్రమాలకు ఆ జ్యం పోసే విధంగా కొనసాగుతున్నటువంటి ధూమపానం మద్యపానం క్లబ్బులు పబ్బులు ఈవెంట్  చెడు వ్యసనాలను రెచ్చగొట్టే దొరణులకు  ఆ డంబరాలకు ఆస్కారం ఇచ్చేటువంటి సన్నివేశాలను అయితే ప్రభుత్వం  నిషేదించాలి కదా! " ప్రభుత్వం మౌనంగా ఉంటూ  స్వేచ్ఛపేరుతో అవకాశాలకు అనుమతిస్తూ  సంఘటనలు జరిగిన తర్వాత బాధపడుతూ  శాంతి భద్రతల సమస్యలుగా సృష్టిస్తే ప్రయోజనం ఏమిటి?  ఇది నిజంగా శాంతిభద్రతల సమస్యలు కానేకావు  అసమానతలు అంతరాలకు ఇక్కడ ఆస్కారమే లేదు  తోటి మనిషిని సాటి మనిషిగా చూడగలిగే మహోన్నతమైనటువంటి  ఆలోచన  మానవీయ దృక్పథాన్ని పెంచి పోషించవలసినటువంటి తరుణం మాత్రమే. "  భయంతోనా, లేక భక్తితోనా,  విచక్షణతోనా,  శిక్షతోనా  ఈ కరుడుగట్టినటువంటి దుర్వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి  ప్రభుత్వాలతో పాటు ప్రతి ఒక్కరు కంకణం కట్టుకోవాల్సిందే! "తన వరకు వస్తే అనే భావన ప్రతి ఒక్కరికి ఉన్నప్పుడు ఈ సంఘటనలు జరగకుండా ఉండే ఆస్కారం ఎక్కువగా  ఉంటుంది. చూసే కోణాన్ని బట్టి  సన్నివేశం, సందర్భం, దుస్ప్రభావం ఆధారపడుతుంది.

అలాంటి వాటిని  టీవీ ప్రసారాలు సీరియల్లో విపరీతంగా  ప్రసారం చేస్తూ, యువతను రెచ్చగొడుతూ,  ఇదే జీవితమనే విధంగా   మద్యపానం ధూమపానాన్ని తెరమీద చూపిస్తూ, అనర్తా లకు ఆజ్యం పోస్తూ,  కుటుంబాలను బ్రష్టు పట్టిస్తూ,  కుటుంబ బంధాలను తెగతెంపులు చేస్తూ,  కలిసి లేకుండా చేసే విధంగా ఉన్న చర్యలు కథలు  రాసే రచయితలు సంభాషణలు రాసే  వాళ్ల పైన కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. "  సీరియల్ మొత్తం కుట్ర కుతంత్రాలతో  చూపించి  విడదీసే విధంగా రాసి చివరికి ఎక్కడో ఒక వాక్యంలో నీతిని చూపిస్తే ఎవరికీ  చేరుతుంది?  ఈ పద్ధతులు రచయితలు నిర్మాతలు దర్శకులు మార్చుకోవాలి.  ప్రసారాలకు పరిమితి ఇచ్చే ముందు ప్రభుత్వాలు  మేధావులు బుద్ధి జీవులతో పరిశీలింప చేయాలి.  అవసరమైన మేరకు తప్ప శృంగారాన్ని  అనుమతించకూడదు.  చివరిగా ధూమపానం మద్యపానం వంటి  రుగ్మతలను శాశ్వతంగా సమాజం నుండి  నిషేధించి  ఆ మత్తులో  అనర్థాలు జరగడానికి ఆస్కారం లేకుండా ప్రభుత్వాలు చూడాలి.  ఈ విషయాలన్నీ పాలకులకు ప్రభుత్వాలకు   నాయకులకు తెలియదా? కానీ  కొంతమంది లబ్ధి కోసం, పెట్టుబడిదారీ వర్గ ప్రయోజనం కోసం  సామాన్య  ప్రజలను ఆహుతి చేయడమే  లక్ష్యంగా పెట్టుకోవడం వల్లనే నేటి సమాజం ఇంత  దిగజారిపోయింది. దీనికి పేదవాళ్లు మధ్యతరగతి వాళ్ళు పేదరికం కారణం కాదు,  అనర్థాలను అదుపు చేయలేని ప్రభుత్వాలు  బాధ్యత వహించాలి .

---వడ్డేపల్లి   మల్లేషము 
(ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు అరసం రాష్ట్ర కమిటీ సభ్యుడు హుస్నాబాద్ జిల్లా సిద్దిపేట తెలంగాణ)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333