శ్రీ తిమ్మప్ప స్వామి భక్తులకు వసతి గృహ నిర్మాణం కు భూమి పూజ
జోగులాంబ గద్వాల 2 జులై 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చే భక్తులకు కర్నూలు పట్టణానికి చెందిన సజ్జన్ గాండ్ల గంగప్ప జ్ఞాపకార్థం సజ్జన్ గండ్ల రాజశేఖర్ దంపతులు రూ.10 లక్షల వ్యయంతో నిర్మించే వసతిగృహ భవన నిర్మాణానికి గురువారం భూమి పూజ నిర్వహించారు. దేవాలయ వ్యవస్థాపక వంశీయుడు శ్రీ కృష్ణ మాన్య పట్వారి ప్రహల్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జోషి రమేష్ ఆచారి రవి ఆచారి , చంద్రశేఖర రావు వాల్మీకి పూజారులు పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయంలో పూజలు నిర్వహించి స్వామివారి శేష వస్త్రాన్ని చిత్రపటాన్ని దాతలకు అందజేశారు.