వెలిశాల జిపిఓ మృతి పట్ల తీవ్ర విషాదం

Apr 18, 2026 - 22:09
 0  3
వెలిశాల జిపిఓ మృతి పట్ల తీవ్ర విషాదం

తిరుమలగిరి 19 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామానికి చెందిన జిపిఓ ముస్తఫా  విధులు నిర్వర్తించుకొని కోదాడలోని తన నివాసానికి వెళ్తుండగా దురాజ్‌పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు అకాల మరణం చెందడం అత్యంత విషాదకరం.వారి మృతితో గ్రామం ఒక మంచివ్యక్తిని కోల్పోయింది. వారి ఆత్మకు శాంతి చేకూరాలని  వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామన్నారు..  సూర్యాపేట ఏరియా హాస్పిటల్‌లో సూర్యాపేట RDO వేణు మాధవరావు, తహసిల్దార్ హరిప్రసాద్ , వెలిశాల గ్రామపంచాయతీ సెక్రటరీ బింజా , కాంగ్రెస్ నాయకులు కుంభం సతీష్ గౌడ్ , మొరిగాల వెంకన్న  తదితరులు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి