వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

Sep 24, 2025 - 16:06
 0  5
వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలి

ప్రతి జర్నలిస్టుకు గౌరవ వేతనం ఇవ్వాలి

అన్ని జిల్లా కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలి

మునగాల మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టి తహసీల్దారు కార్యాలయంలో వినతి పత్రం అందించిన--పలు జర్నలిస్టు సంఘాల నాయకులు

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉదృతం చేస్తాం

టీఎస్ జెఏ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

రాష్ట్రవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ ఇందిరమ్మ ఇండ్లు,ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రంలో పలు జర్నలిస్టు సంఘాల నాయకులు కమిటీల సభ్యులు యూనియన్లకు అతీతంగా మండల  కేంద్రంలో జాతీయ రహదారి పైన నిరసన కార్యక్రమం చేపట్టారు.అనంతరం తహసిల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కందుకూరి యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇంటి స్థలాలు ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అన్ని జిల్లా కేంద్రాల్లో,నియోజకవర్గ కేంద్రాల్లో ప్రెస్ క్లబ్ భవనాలు నిర్మించాలని కోరారు. ప్రెస్ క్లబ్ సొంత భవనాలు లేక జర్నలిస్టు నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.ఎటువంటి వేతనాలు లేకుండా ప్రజలకు ప్రభుత్వానికి ఉచితంగా సేవ చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుండి వేళల్లో లక్షల్లో వేతనాలు తీసుకుంటున్న ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి ప్రత్యేక సౌకర్యాలు పొందుకుంటున్నారని గుర్తు చేశారు.అలాంటిది ఎన్నో సంవత్సరాలుగా ఇదే వృత్తిలో కొనసాగుతూ ఉచిత సేవ చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించకపోవడం చెప్పండి సరేంది కాదన్నారు. ప్రభుత్వాలు కొన్ని మీడియా సంస్థల యాజమాన్యాలను గుప్పెట్లో పెట్టుకొని ఆయా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చి తమ బాధ్యత తీరింది అనుకోవడం ప్రభుత్వ బాధ్యతారహిత విధానంతో ఉండడం సరైనది కాదన్నారు.ప్రభుత్వం జర్నలిస్టుల జీవితాలతో ఆడుకోవద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాకుండా అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ఎటువంటి ఖర్చు లేకుండా ఆసుపత్రి సేవలు అందుకునే విధంగా హెల్త్ కార్డులు ఇవ్వాలన్నారు.ప్రభుత్వ గుర్తింపు కార్డులు జారీ చేసేవి విషయంలో జాప్యం చేయకుండా వెంటనే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు.ఇంతే కాకుండా ప్రతి జర్నలిస్టుకు గౌరవ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమ సమస్యలు పరిష్కరించే వరకు అన్ని యూనియన్ల కమిటీ సభ్యులతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో..లింగంపల్లి నాగబాబు (ప్రజా దర్బార్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు (నవతెలంగాణ) అలుగుబెల్లి వెంకటరెడ్డి,ఎస్. ఉపేందర్ (ఆంధ్రజ్యోతి) గోపి (మెట్రో) గుంటి శ్రీనివాస్ (ప్రజాపక్షం) దుస్స చంద్రశేఖర్ (నిజం చెబుతాం) బంగారు శ్రీను (సూర్య)  ఇంకా పలు దినపత్రికలో కొనసాగుతున్న జర్నలిస్టులు పాతకోట్ల నాగరాజు,శ్రీనివాస్ గౌడ్, నాగులు మీరా,ఖాదర్, సోమయ్య,సందీప్, సతీష్, ,యాతాకుల మధుసూదన్, రవి చందు తదితరులు పాల్గొన్నారు

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333