వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన 

Dec 4, 2024 - 14:04
 0  5
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన 
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన 

అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బింగిదొడ్డి దొడ్డెప్ప 

 వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్ 

 వడ్డేపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ సుజాత రామకృష్ణారెడ్డి 

జోగులాంబ గద్వాల 4 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి: వడ్డేపల్లి. సన్న రకాలకు బోనస్ 500 రూపాయలు  తేమశాతం 17  ఏ గ్రేడ్ వరి ధాన్యానికి 2320 రూపాయలు  సాధారణ వరి ధాన్యానికి 2300 రూపాయలు  వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోగలరు నాణ్యమైన ఉత్పత్తికి వడ్డేపల్లి మండలం పైపాడు  గ్రామం వరి ధాన్యం పండించడంలో ఎంతో ప్రసిద్ధి గాంచింది అని అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బింగిదొడ్డి దొడ్డెప్ప పేర్కొనడం జరిగింది


జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడు గ్రామంలో అధికారులతో కలిసి బుధవారం వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు .ఈ సందర్భంగా అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బింగిదొడ్డి దొడ్డెప్ప మాట్లాడుతూ రైతులు  పండించిన పంటను స్వయంగా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి విక్రయించాలన్నారు కొనుగోలు కేంద్రం దగ్గర మధ్యవర్తులకు దళారులకు సంప్రదించకుండా నేరుగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి విక్రయించాలన్నారు కొనుగోలు కేంద్రం దగ్గర ఎలాంటి సమస్యలు వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ బింగిదొడ్డి  దొడ్డెప్ప తెలపడం జరిగింది 


ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిన్ని బాబు మైనార్టీ అధ్యక్షుడు మైనుద్దీన్ జయరామిరెడ్డి గోవింద్ ఈశ్వర్ మహిళా సంఘాల వారు కాంగ్రెస్ కార్యకర్తలు రైతులు పాల్గొనడం జరిగింది

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333