వడ దెబ్బల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

Mar 23, 2026 - 18:34
Mar 23, 2026 - 19:43
 0  1
వడ దెబ్బల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

  గ్రామ, మున్సిపాలిటీలలో చలి వేంద్రాలను ఏర్పాటు చేయాలి

వడదెబ్బ అప్రమత్తతపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి

వేసవి కాలం సమీపిస్తున్న కొద్దీ, ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నందున,

ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. 

సూర్యాపేట, 24 మార్చి 2026 తెలంగాణవార్త విలేఖరి:- సోమవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో రానున్న వేసవికాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ తో నిర్వహించిన సమీక్ష  సమావేశంలో కలెక్టర్ తేజస్ నంద్ లాల్, అదనపు కలెక్టర్ కె.సీతారామరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రానున్న వేసవికాలంలో వాతావరణ మార్పులతో మనుషులలో ఆరోగ్య సమస్యలు తలెత్తి శరీరంలో నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ గురయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.. ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ఉండేందుకు అన్ని శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.. ముఖ్యంగా గ్రామ, పట్టణ, మున్సిపాలిటీ లలో చలి వేంద్రాలు ఏర్పాటు చేసి నీటి సమస్య లేకుండా చూడాలన్నారు. ముఖ్యంగా మున్సిపాలిటీ లలో, ప్రజలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పాటు బస్ స్టాండ్ లలో చలి వేంద్రాలు ఏర్పాటు చేసి నీటి కొరత లేకుండా చూడాలన్నారు.

అదే విదంగా వడ దెబ్బతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, అన్ని ధవాఖానాలలో అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాలని, పిహెచ్సి లలో వడ దెబ్బ బారిన పడిన వారి కోసం బెడ్లను, సెలైన్ లను సిద్ధంగా ఉంచాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. త్వరలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్న క్రమంలో కొనుగోలు కేంద్రాల్లో త్రాగు నీటి సదుపాయాలను కల్పించాలని, గ్రామాలలో పశువుల కోసం నీటిని అందుబాటులో ఉంచాలని, ఇందుకోసం పశువుల తొట్టిలను మరమ్మతులు చేసి సిద్ధంగా ఉంచాలని సూచించారు. కలెక్టరేట్ లో పని చేసే ఉద్యోగులు, సిబ్బంది    ఖచ్చితంగా  వాటర్ బాటిల్స్ అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అదే విదంగా మధ్యాహ్నం ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశాలు ఉన్నందున బయటకు రాకుండా చేసుకోవాలన్నారు. ముఖ్యంగా కాటన్ దుస్తులను ధరించాలని, కూల్ డ్రింక్స్ కాకుండా ఓఆర్ఎస్ లేదా పండ్ల రసాలు తీసుకోవాలని సూచించారు.

కార్యక్రమం లో అదనపు కలెక్టర్ కె సీతారామారావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ, సీఈఓ జిల్లా పరిషత్ శిరీష,  డిప్యూటీ డిఎంహెచ్ఓ చంద్రశేఖర్ ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333