రోడ్లపై మేకలు ప్రమాదానికి గురవుతున్న వాహనదారులు

తిరుమలగిరి 28 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
హైవేపై మేకలు
ప్రమాదానికి గురవుతున్న వాహనాదారులు
పట్టించుకోని అధికారులు
తిరుమలగిరి మున్సిపాలిటీ లోని సూర్యాపేట టు జనగాం హైవే రహదారులపై మేకల వల్ల వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు ముఖ్యంగా వ్యవసాయ మార్కెట్ గేటు దగ్గర రోడ్డుపై మేకలు స్వేచ్ఛగా తిరగడం వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని . రహదారిపై ఉన్నట్టుండి మేకల అడ్డుగా వస్తే వాటిని తప్పించే క్రమంలో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది అని ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు చిన్న వాహనాలకు ఇది ఎక్కువ ప్రమాదకరం మున్సిపల్ అధికారులు ఇట్టి సమస్యలను వాహనదారులు ప్రమాదాల గురికాకుండా మేకల యజమానులపై అటు చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుకుంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మేక కాపరులు వాటిని రోడ్డుపైకి రాకుండా చూసుకోవాలని లేదా వాహనదారులు తగిన జాగ్రత్త తీసుకోవాలని కొందరు సూచనలు కూడా చేస్తున్నారు రోడ్డు పక్కన హెచ్చరిక బోర్డులను పెట్టడం లేదా మేకల కోసం మున్సిపల్ అధికారులు మేకల యజమానులకు రోడ్డుపైకి రాకుండా హెచ్చరించడం మంచిదని ప్రజలు వాహనదారులు కోరుకుంటున్నారు....