రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్

జిల్లా కేంద్రంలో ఆరైవ్ అలైవ్ రోడ్డు భద్రత భారీ ర్యాలీ.

Apr 18, 2026 - 14:21
Apr 18, 2026 - 14:24
 0  1
రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్
రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్
రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్
రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్
రోడ్డు భద్రతపై కదం తొక్కిన సూర్యాపేట జిల్లా పోలీస్

సూర్యాపేట, 18 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- ప్రజలు వాహనదారులు రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ కోసం భాగస్వామ్యం కావాలని, సూర్యాపేట జిల్లాను రోడ్డు ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలని ఎస్పీ నర్సింహా  సూచించారు.

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ, అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట పట్టణ కేంద్రంలో పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ కోసం జిల్లా ఎస్పీ పోలీసు సిబ్బందికి అరైవ్ అలైవ్ రోడ్డు భద్రత లోగో కలిగిన హెల్మెట్స్ పంపిణీ చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయం నందు ర్యాలీ ప్రారంభమై సూర్యాపేట పట్టణంలో కోర్టు చౌరస్తా, పిఎస్ఆర్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్, ఎంజీ రోడ్డు మీదుగా కొత్త బస్టాండ్ వరకు నిర్వహించడం. జిల్లా ఎస్పీ నర్సింహగారు అదనపు ఎస్పీలు, డీఎస్పీలు, పోలీసు సిబ్బందితో కలిసి ర్యాలీని ముందుండి నడిపించారు. కొత్త బస్టాండ్ వద్ద పోలీసు సిబ్బంది రోడ్డు భద్రత మానవహారం నిర్వహించి ప్రతిజ్ఞ చేయడం జరిగింది. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు మాట్లాడుతూ పోలీసు సిబ్బంది క్రమశిక్షణ, శారీరక దారుఢ్యం లో భాగంగా జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ నందు పరేడ్ నిర్వహించడం జరిగిందని అనంతరం జిల్లా కేంద్రంలో భారీ రోడ్డు భద్రత ర్యాలీ నిర్వహించామని తెలిపారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా రోడ్డు భద్రత నియమాలపట్ల అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని ఈనెల 13వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తూ రోడ్డు భద్రతా నియమాల పట్ల ప్రజలను అవగాహన కల్పిస్తూ చైతన్యవంతం చేస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రత పట్ల పోలీస్ శాఖ కదం తొక్కిందని ప్రజలను చైతన్యవంతం చేసి రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పోలీస్ శాఖ ఇతర శాఖలతో సమన్వయంగా కృషి చేస్తుందని తెలిపారు. ప్రజలు వాహనదారులు పోలీసు వారి సూచనలు, రోడ్డు నియమ నిబంధనలు, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ డిఫెన్స్ డ్రైవింగ్ తో వాహనాలు నడపడం ద్వారా రోడ్డు ప్రమాదాలను నిర్మూలించవచ్చని, డిఫెన్స్ డ్రైవింగ్ ద్వారానే ప్రతి ప్రయాణం సురక్షిత గమ్యం చేరుతుందని తెలిపారు. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ రోడ్డు నిబంధనల పట్ల ప్రజలను అప్రమత్తంగా చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి పోలీసు అధికారి భాగస్వామ్యం అవుతున్నారని ప్రజలు వాహనదారులు భాగస్వామ్యమై రోడ్డు ప్రమాదాల నివారణకు బాధ్యతగా ఉండాలని కోరారు. మద్యం మత్తులో వాహనాలు నడపవద్దని, రాంగ్ రూటులో వాహనాలు నడపకూడదని, పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని, ప్రయాణ సమయంలో హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పకుండా ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ వినియోగించకూడదని కోరారు. ప్రమాద స్థలాలలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశామని వాహనదారులు హెచ్చరిక బోర్డులను గమనిస్తూ ముందుకు సాగాలని తెలిపారు. 

హెల్మెట్స్ అందజేసిన సెవెన్ స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ అధికారిని సన్మానించిన ఎస్పీ. 

రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్ర పోలీసు ప్రణాళిక మేరకు నిర్వహిస్తున్న ఈ రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలకు స్పందించిన సూర్యాపేటకు చెందిన సెవెన్ స్టార్ సోలార్ ఎంటర్ప్రైజెస్ యజమాని మల్లేష్ పోలీస్ సిబ్బందికి హెల్మెట్స్ అందించారు. ఈ సందర్భంగా హెల్మెట్స్ అందించినందుకు గాను పోలీసుల సమక్షంలో మల్లేష్ ను ఎస్పీ గారు సన్మానించారు. 

ఈ ర్యాలీ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ లు రవీందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, నరసింహాచారి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, సూర్యాపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, ఆర్ముడ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్లు ప్రవీణ్, జానయ్య, ఆర్ఎస్ఐలు ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333