రైతులను దగా చేస్తున్న రైస్ మిల్లర్లు

May 6, 2025 - 20:14
 0  10
రైతులను దగా చేస్తున్న రైస్ మిల్లర్లు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ రైతులను దగా చేస్తున్న రైస్ మిల్లర్లు వ్యవసాయ అధికారులు తేమ పరీక్షించినా రైస్ మిల్లర్లు తిరకాసు. క్వింటాల్లో ధాన్యం నష్టపోతున్న రైతులు.. అధికారులు ఆదేశాలు బేఖాతరు. *ఆత్మకూరు ఎస్..* రైతు ముంగిట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు అంటూ చెప్పుకుంటున్న ప్రభుత్వాలు, అధికారులు రైస్ మిల్డర్ల దోపిడీని అరికట్టలేని పరిస్థితిలో ఉన్నారు. నెలలు తరబడి ఐకెపి కేంద్రాల్లో ధాన్యం అరబోసి వ్యవసాయ అధికారులు తేమశాతం పరీక్షించి ధ్రువీకరించాక ఐకెపి నిర్వాహకులు కాంటాలు వేసి లారీలతో రైస్ మిల్లుకు తరలించినా రైస్ మిల్లర్లు దాన్యంలో తేమ ఉందంటూ ధాన్యం లో కోత పెడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పాతర్లపాడు ఐకెపి కేంద్రం నుండి తేమ శాతం పరీక్షించాక కాంటాలు వేసి 9వందల బస్తాల ధాన్యం లారీలో మంగళ వారం జనగాం మహాలక్ష్మి రైస్ మిల్ కు పంపించారు. ధాన్యం లో తేమ ఉన్నదంటూ, కొంతతాలు, ఉందంటూ మళ్ళీబస్తా కు అరకేజి తరుగంటూ రైతుల ను వేదిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రం లో క్వాలిటీ వచ్చిన ధాన్యం కాంటాలు వేసినప్పటికీ లోడు తో వెళ్ళిన ధాన్యం ను తేమ, తాలు అంటూ మిల్లు యజమాని వేధిస్తున్నారని ఆరోపించారు.ఒక రోజు మొత్తం ధాన్యం దిగుమతి చేయకుండ ఇబ్బందుల కు గురి చేశారని తెలిపారు.అధికారులు చెప్పినా నిర్లక్ష్యం గా వ్యవహరిస్తున్న రైస్ మిల్లర్లు ధాన్యం లో కోత పెట్టేందుకు క్వింటాల కొద్ది అక్రమంగా అడుగుతున్నారని లారీకి 5నుండి 6క్వింటాల ధాన్యం అదనంగా అడుగుతున్నారని ఆరోపించారు.రైతుల ను ఐకెపి లో 40 కేజీ లకు గాను 41 కేజీలు తూకం వేసి పంపారు. మళ్ళీ రైస్ మిల్లర్లు దాన్యంలో కోత విధించడం తో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఉన్నతాధికారులు కలుగచేసుకుని మిల్లర్ల ఆగడాలు ను అరికట్టాలని వారిపై చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు ఉప్పలయ్య, బాలస్వామి డిమాండ్ చేస్తున్నారు. *Apm మంజుల వివరణ..* పాతర్ల పహాడ్ ఐకెపి కేంద్రాల్లో ధాన్యం తేమ తాలు పరీక్షలు చేసి పంపామని మిల్లర్లు రైతుల ను సతాయిస్తున్నారని ఐకెపి నిర్వాహకులను మిల్లు వద్దకు పంపి సమస్య పరిష్కారం చేస్తామని వివరణ ఇచ్చారు.