మురుగునీటి కాలువ పక్కనే మంచినీరు బోరు
మురుగునీటి కాలువ పక్కనే మంచినీరు బోరు
స్పందించిన సర్పంచ్ సరస్వతి.
తెలంగాణవార్త(నుగూరు)వెంకటాపురం, మార్చి 7 : మలుగు జిల్లా వెంకటాపురం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఆర్టీసీ బస్టాండు వెనకాల ఉన్న తాగునీరు పంపు డ్రైనేజీకి అతి దగ్గరలో ఉండడంతో అవే నీరు తాగుతున్న ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేజర్ గ్రామపంచాయతీలోని నాయకులగూడెం, జక్కుల వారి వీధి శివాపురం మెయిన్ రోడ్డు తదితర వీధులకు చెందిన ప్రజలు ఈ నీరుని మంచినీరుగా వాడుతున్నారు. బస్టాండు పరిసర ప్రాంతాల్లో అత్యధికంగా బురదమయం ప్రతినిత్యం ప్రధాన రహదారిపై ఉన్న కాలువలనుండి మురుగునీరు బస్టాండు ప్రాంగణం నుండి బోరు పక్కనుండి పోయేకకాలువలో కలుస్తున్నాయి ప్రధాన రహదారిపై ఉన్న ప్రధాన కాలవల్ని మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. దీనిపై మేజర్ గ్రామపంచాయతీలో ఆర్ అండ్ బి రహదారి వెంట ఉన్న సైడ్ డ్రైనేజీలను పునరుద్ధరించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.
వర్షాకాలంలో మంచినీరు బోరు మొత్తం మునిగిపోవడం బురద నీరు చేరడం పలుసార్లు జరిగింది. అంతేకాకుండా మురుగునీరుతో పక్కనే ఉన్న నివాసాల ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. దీనిపై వెంకటాపురం మెజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ సరస్వతి కి తెలంగాణ క్రాంతి వెంకటాపురం ప్రతినిధి సమస్యను తెలియజేశారు. స్పందించిన ఆమె తక్షణమే వచ్చి అక్కడ ఉన్న పరిస్థితులను అవగాహన చేసుకున్నారు దీనిపై త్వరలోనే చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రధాన రహదారిపై ఉన్న కాలువల్ని త్వరలోనే మరమ్మతులు చేసి అటు నుంచి వచ్చే మురుకునీరూ అరికడతామని తెలియజేశారు.