మున్సిపల్ ఎన్నికల్లో ములుగు చైర్ పర్సన్ పదవిని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ
నల్లెల స్వాతికి చైర్మన్ బాధ్యతలు అప్పజెప్పనున్నట్ల...?
ములుగు జిల్లా,తెలంగాణ వార్త న్యూస్, ఫిబ్రవరి :15 ములుగు జిల్లా లో నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీ ఎన్నికలలో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 12 మంది సభ్యుల గల కోరంతో కాంగ్రెస్ పార్టీ ఉంది మున్సిపాలిటీ చైర్మన్ కు అర్హత గల స్థానాలు కాంగ్రెస్ పార్టీకి ఉన్నవి ఇందులో దివంగత నాయకుడు కాంగ్రెస్ పార్టీ మాజీ ములుగు జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి కోడలు అయినా నల్లెల స్వాతికి చైర్ పర్సన్ బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు కాంగ్రెస్ వర్గాలలో కార్యకర్తలలో గుసగుసలు నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కీ,,శే,, నల్లెల కుమార్ స్వామి చేసిన సేవలకు గుర్తింపుగా వారి కుటుంబానికి ఆ పదవి బాధ్యతలు ఇచ్చి పార్టీ అండగా ఉంటుందని మరోసారి కాంగ్రెస్ పార్టీ రుజువు చేసుకోనున్నారు.