మిధానిలో ఘనంగా భారతరత్న అవార్డు గ్రహిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు

Apr 14, 2026 - 16:58
Apr 14, 2026 - 18:34
 0  1
మిధానిలో ఘనంగా భారతరత్న అవార్డు గ్రహిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  జయంతి వేడుకలు

హైదరాబాద్, 15 మార్చి 2026 (బుధవారం) తెలంగాణా వార్త రిపోర్టర్ :- మిధానిలో ఆదివారం ఎస్సి మరియు ఎస్టి,ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్  ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ, జయంతి వేడుకలు చిరంజీవి ఆధ్వర్యం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఎస్. వి.ఎస్ నారాయణ మూర్తి హాజరయ్యారు. చైర్మన్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు మరువలేనివని కొనియాడారు.ఇతను కొలంబియా విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి.,లండన్ విశ్వవిద్యాలయం నుండి డి.ఎస్.సి (డాక్టరేట్) పట్టాలను పొంది చాలా అరుదైన గౌరవాన్ని సంపాదించాడు.న్యాయ, సామాజిక, ఆర్థిక శాస్త్రాలలో పరిశోధనలు చేశాడు. మొదట్లో న్యాయవాదిగా, అధ్యాపకుడిగా, ఆర్థికవేత్తగా పనిచేశాడు. తరువాత భారతదేశ స్వాతంత్ర్యం, పత్రికల ప్రచురణ, దళితుల సామాజిక రాజకీయ హక్కులు, భారతదేశ రాజ్యాంగ వ్యవస్థాపన కోసం కృషి చేశాడు. 1956లో ఇతను బౌద్ధ మతాన్ని స్వీకరించడంతో దళితులు సామూహికంగా బౌద్ధంలోకి మత మార్పిడి చేసుకున్నారు.1990లో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నను ఇతనికి మరణాంతరం ప్రకటించింది. భారతదేశ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిన నాయకుడు. ఇతను చేసిన విశేష కృషికి ఇతని పుట్టినరోజును అంబేద్కర్ జయంతిగా జరుపుకుంటారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్  భాగస్వామ్యంతో అవుట్ లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్ లో అతను మొదటి స్థానంలో ఎంపికైయ్యాడు అని కొనియాడారు. అదేవిధంగా అంబేద్కర్ జయంతి సందర్భంగా సాంస్కృతిక కళాకారుల బృందం తోటి పాటలు పాడించి, బర్త్డే కేక్ క త్తిరించి జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. తదనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు డిపిఎంపీ బాబు, డిఎఫ్ మధుబాల,CVO స్ఫూర్తి రెడ్డి,అసోసియేషన్ లిసెన్ ఆఫీసర్ ఆనంద్ కుమార్,HR AGM హరికృష్ణ, అసోసియేషన్ ప్రెసిడెంట్ సుబ్బారావు, జనరల్ సెక్రెటరీ కిష్టయ్య, కోశాధికారి చిరంజీవి, అసోసియేషన్ సభ్యులు మంజుల,అల్లుడు శ్రీను, కిర్బీ, ఇప్గ్
వెంకటేష్, అనిల్,అడ్వజర్ స్వామి,సందీప్,గణేష్ MW&SU ప్రెసిడెంట్ శ్రీహరి, MEU జనరల్ సెక్రటరీ శ్రీను, ఓబీసీ ప్రెసిడెంట్ సంజీవ్, ఎస్టీ అసోయేషన్ మహేష్,NUSపొట్టి క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333