మహబూబాబాద్ అభివృద్ధి – ప్రజల ఆశయ సాధన
మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ జ్యోతి రమేష్ కి హార్దిక శుభాకాంక్షలు
మహబూబాబాద్ జిల్లా ప్ర3తినిధి
సోమవారం మెజారిటీ కౌన్సిలర్ల మద్దతుతో నూతనంగా ఎన్నుకోబడిన మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ (స్వతంత్ర అభ్యర్థి) జ్యోతి రమేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందచేసి శాలువాతో సన్మానించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే, డీసీసీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ. మహబూబాద్ జిల్లా ఎమ్మెల్యే మురళి నాయక్ ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థి కాంగ్రెస్ పార్టీలో చేరటంతో మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గత మూడు రోజులుగా
ఈ విజయంతో జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని నాయకులు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ నిరంతర పోరాట పటిమ, డిసిసి అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళి నాయక్ సమర్థ నాయకత్వం, చాకచక్యమైన వ్యూహంతో ఈ విజయం సాధ్యమైందని వారు అభిప్రాయపడ్డారు.
మహబూబాబాద్ పట్టణ అభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవలో నూతన అధ్యాయం ప్రారంభమైందని ఆశిస్తూ చైర్మన్ జ్యోతి రమేష్ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకొని పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మున్సిపాలిటీ చైర్మన్ గుగులోత్ జ్యోతి రమేష్ నాయక్ మాట్లాడుతూ మానుకోట పట్టణం ని ప్రగతి పథంలోనే అభివృద్ధి కి నాంది పలుకుతా, ఎలాంటి ఒత్తుళ్లకు లోను కాకుండా అన్నాపని సక్రమంగా చేసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తానని, కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సాధ్యమని రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎమ్మెల్యే మురళి నాయక్ ఆధ్వర్యంలో పనిచేసి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని, నా ఎన్నికకు సహకరించిన ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్, డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, మాజీ డిసిసి అధ్యక్షులు భరచంద్ రెడ్డి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు. చైర్మన్ గుగులోతు జ్యోతి రమేష్ నాయక్ ని అభినందించిన వారిలో డిసిసి అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, ఎమ్మెల్యే మురళి నాయక్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అజ్మీర సురేష్ నాయక్, మున్సిపల్ కౌన్సిలర్ రాజేశ్వర్, ఆర్డిఓ, ఎమ్మార్వో, వైస్ చైర్మన్ సోమయ్య, జిల్లా నాయకులు పద్మం ప్రవీణ్ కుమార్, కార్పొరేషన్ కౌన్సిలర్లు ఖలీల్, రాజు, నాగేశ్వరరావు, కాటా భాస్కర్, శ్రీదేవి, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.