మన ఆపద్భాంధవులు ఫౌండేషన్

Apr 26, 2026 - 15:07
Apr 26, 2026 - 16:07
 0  4

మిర్యాలగూడెం 26ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– తెలంగాణ రాష్ట్రంలో కాకుండా వివిధ రాష్ట్రాలలో కూడా ఎనలేని సేవలు అందిస్తున్న మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ సంస్థ వారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండల పరిధిలోని వెంకటాద్రిపాలెం గ్రామంలో ఆకలితో బాధపడుతున్న వారు బట్టు నాగయ్య దురదృష్టవతు మరణించిన పరిస్థితి కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మరణించిన ఇంటి పెద్ద దిక్కుకోల్పోయి నాగయ్య కుటుంబం. ఆ యజమానికీ భార్య, ఇద్దరు కొడుకులు. కూలీనాలీ చేస్తూ రోజులు గడిపే కుటుంబం,పెద్ద దిక్కును కోల్పోవడం బాధకార విషయం. వీళ్లకు ఎలాంటి జీవనోపాధి లేదు, రెక్కడితే బుక్కెడు మెతుకులు అని గడిపే కుటుంబం వారికి మన సైన్యం సహాయం అవసరమని సమాచారం రావడం జరిగింది. సమాచారం అందించిన వారు మన ఆపద్బాంధవులు ఫౌండేషన్ సభ్యులు హుసేన్ భాయ్ సీఐ సైదులు, వీరశేఖర్, దేశ్య నాయక్, ఆరిఫ్ మన ఆపద్భాంధవులు సహాయం 1వేయి మంది సైన్యం తరుపున సహాయం చేయడం జరిగింది. 50కిలోల బియ్యం 14రకాల నిత్యావసర సరుకులు కూరగాయలు. ఈ సహాయం అందజేయడానికి వెళ్ళిన సభ్యులందరికీ మన ఆపద్బాంధవుల ఫౌండేషన్ వెయ్యి మంది తరుపున ధన్యవాదాలు నిన్న సహాయం జరిగింది. సహాయం చేసిన వారందరికీ ఆపద్బాంధవుల ఫౌండేషన్ తరపున వారి కుటుంబాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు చల్లగా వర్ధిల్లాలని ఫౌండేషన్ వారు కోరుకుంటున్నారు.