భారీ అగ్ని ప్రమాదం బోరు మోటార్లు స్టార్టర్లు దగ్ధం

Jun 1, 2026 - 23:06
 0  3
భారీ అగ్ని ప్రమాదం బోరు మోటార్లు   స్టార్టర్లు దగ్ధం

 తిరుమలగిరి 02 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

 తిరుమలగిరి మండలం తొండ గ్రామంలోని గాండ్లోని కుంట కింద వరి కొయ్యలకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టిన ఘటనలో రైతులకు భారీ నష్టం జరిగింది. మంటలు వేగంగా వ్యాపించడంతో 20 ఎకరాలకు పైగా మడికట్లలో ఉన్న గడ్డి పూర్తిగా తగలబడింది. ఈ ప్రమాదంలో  మైనాల రాజయ్య, మైనాల చందర్రావు ,బాష్పాల మహేందర్ రైతులకు చెందిన బోర్లు మూడు స్టార్టర్లు, మూడు విద్యుత్ వైర్లు నల్లటి పైపులు కాలిబూడిదయ్యాయి.ఈ ఘటనతో దాదాపు రెండు లక్షల రూపాయలు నష్టాల్లో కూరుకుపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి తమకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలని రైతులు కోరారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి