భద్రాచలంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలోవైభవంగా రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు

Jun 2, 2026 - 19:46
 0  0
భద్రాచలంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలోవైభవంగా రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు

భద్రాచలంలో ఈసారి బిఆర్ఎస్ జెండా రెపరెపలు : రావులపల్లి 

కెసిఆర్ సారే మళ్ళీ రావాలి : మానే

తెలంగాణ వార్తజూన్ 2 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం : భద్రాచలంలో మంగళవారం జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలు గులాబీ దళం ప్రదర్శించిన భారీ శక్తికి అద్దం పట్టాయి. ఉద్యమ పురిటిగడ్డపై రెపరెపలాడిన గులాబీ జెండా, తెలంగాణ పోరాట పటిమను మరోసారి చాటిచెప్పింది.
నిప్పులు చెరిగే నినాదాలతో కార్యకర్తలు హోరెత్తించగా, భద్రాద్రి వీధులన్నీ గులాబీమయంగా మారాయి. రాష్ట్ర సాధనలో బిఆర్ఎస్ చూపిన తెగువను స్మరించుకుంటూ, నాయకులు కార్యకర్తలలో నూతనోత్సాహాన్ని నింపారు. ప్రతి అడుగులోనూ పోరాట వారసత్వాన్ని మోస్తున్న గులాబీ శ్రేణులు, తమ పట్టు ఏమాత్రం తగ్గలేదని స్పష్టం చేశారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ, తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటామని నాయకులు పదునైన శపథం చేశారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన నిలిచే ఏకైక శక్తి బిఆర్ఎస్ అని ఈ వేడుకలు నిరూపించాయి. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే, రాబోయే రాజకీయ పోరాటాలకు ఇక్కడే పునాది పడిందని అర్థమవుతోందని నేతలు తెలిపారు నేటి ఈ సంబరాలు ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా, బిఆర్ఎస్ సత్తాను చాటిచెప్పాయన్నారు. ఉద్యమ కసి.. నాయకత్వం పట్ల నిబద్ధతతో భద్రాచలంలో బిఆర్ఎస్ శ్రేణులు సరికొత్త రికార్డు సృష్టిం చ బోతోందని కార్యకర్తలు తెలిపారు. భద్రాచలం పట్టణంలో టిఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబరాలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద జాతీయ పతాకాన్ని బిఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గం ఇంచార్జ్ రావులపల్లి రాంప్రసాద్ ఆవిష్కరించారు. అమరవీరుల స్తూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో... ఉద్యమ నేత, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు  మానే. రామకృష్ణ,రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఆర్ఎస్ భద్రాచలం నియోజకవర్గ ఇన్చార్జ్ రావులపల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ... భద్రాచలంలో ఈసారి గులాబీ జెండా ఎగరట0 ఖాయమని అన్నారు.
 ఈ కార్యక్రమంలో ఉద్యమకారులు తిప్పన సిద్ధులు, మండల పార్టీ నాయకులు కోటగిరి ప్రమోద్ కుమార్, తుమ్మలపల్లి ధనేశ్వరరావు, ఆకోజు సునీల్ కుమార్, కొల్లం జయకు ప్రేమ్ కుమార్, రేపాక పూర్ణచంద్రరావు, ఏడవ వార్డు సభ్యులు కావూరు గోపి, ఉడత రమేష్,గోసుల శ్రీనివాస్, కావూరి సీతా మహాలక్ష్మి, పూజల లక్ష్మి, మాజీ నియోజకవర్గ ఇన్చార్జి బీరబోయిన వెంకట నర్సమ్మ, తదితరులు పాల్గొన్నారు,
ఎండ్

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333