బి ఆర్ టి యు ఆధ్వర్యంలో మేడే జెండా ఆవిష్కరణ
ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో మాజీ శాసన సభ్యులు డా "గాదరి కిశోర్ కుమార్ ఆదేశానుసారం భారత రాష్ట్ర సమితి ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జ్ గౌడిచర్ల సత్యనారాయణ గౌడ్ మేడే జెండా ఆవిష్కరణ చేసి అనంతరం కెసిఆర్ మరియు గాదరి కిశోర్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ కార్మికులందరికీ కూడా మే డే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది గత రెండున్నర ఏళ్లుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం గాని దేశంలోని బిజెపి ప్రభుత్వం గానీ కార్మిక సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదని అన్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కార్మిక సంక్షేమం కోసం ఒక్కటంటే ఒక్కటి కూడా చేసింది ఏమీ లేదని అన్నారు ఆనాడు కేసీఆర్ గారు చెప్పిన విధంగా మనలో ఐక్యత దెబ్బతిన్ననాడు పాలకులు గాని ప్రభుత్వాలు గాని ఏమి చేయమని మన ఐక్యంగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని సాధించవచ్చునని అన్నారు కేసీఆర్ గతంలో చాలీచాలని జీతాలతో ఇబ్బంది పడుతున్న అంగన్వాడి వర్కర్లకు వర్కర్లకు గ్రామపంచాయతీ వర్కర్లకు మున్సిపాలిటీ కార్మికులకు హోంగార్డ్స్ కు రెండు నుండి మూడు రెట్లు వేతనం పెంచటం జరిగింది. రవాణా రంగంలో పనిచేస్తున్నటువంటి ఆటో కార్మికులకు భృతి నెలకు 12000 ఇస్తానని ఇప్పటికి ఇవ్వలేదు గతంలో కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి డ్రైవర్ ప్రమాదా బీమా ఐదు లక్షల రూపాయలను రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా కమర్షియల్ వాహనాలు కొనుగోలుపై సెస్ టాక్స్ కింద పదివేల రూపాయలు పెంచడం జరిగింది నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు డా"గాదరి కిషోర్ కుమార్ 42 మంది డ్రైవర్ సోదరులకు డ్రైవర్ ప్రమాద బీమా పథకాలను అందించి వారి కుటుంబాలకు ఆర్థికచేయుతనందించారు అదేవిధంగా నిరుపేదలైనటువంటి భవన నిర్మాణ కార్మికులందరిని దృష్టిలో ఉంచుకొని వారికి భవన నిర్మాణ లేబర్ ఇన్సూరెన్స్ కార్డులను సుమారుగా 4500 మందికి అందించారు ఏదైనా ఏదైనా ప్రమాదంలో గాయపడ్డ కార్మికులకు వైద్య పరంగా గాని ప్రభుత్వ పరంగా గాని ఎన్నో ఆర్థిక సహాయ సహకారాలు అందించినటువంటి కిశోర్ కుమార్ కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు తాటికొండ సీతయ్య బిఆర్ఎస్ నాయకులు దొంగరి శ్రీనివాస్ అన్నారం సర్పంచ్ శ్రీనివాస్, మట్టపల్లి వెంకట్ తడకమల్ల రవికుమార్, BRTU నాయకులు కూరపాటి సోమేశ్, గుడిపాటి కోటి రాజేశ్, జయమ్మ, గోపగాని వెంకన్న రమణమ్మ, జొన్సన్ కార్మికులు పాల్గొన్నారు.