బండ కొత్తపల్లి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి : గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్
గుండాల 04 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
గుండాల మండల పరిధిలోని ఆనంతారం గ్రామంలో పులి జనావాస ప్రాంతాల వైపు సంచరిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పశువులు, మూగజీవాలు పులి దాడిలో బలయ్యాయి దీంతో బండ కొత్తపల్లి గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ మాట్లాడుతూ. ఈ ఘటనలు స్థానిక ప్రజల్లో భయాందోళనలకు కారణమవుతున్నాయి. అడవులు, పొలాల పరిసర ప్రాంతాల్లో నివసించే ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. పులి సంచారం మనుషులపై కూడా ప్రమాదంగా మారే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్తలు చాలా కీలకం.
మండల ప్రజలు రాత్రి వేళల్లో ఒంటరిగా బయటకు వెళ్లకుండా ఉండాలి.
• ముఖ్యంగా పొలాలకు, అటవీ ప్రాంతాల సమీపానికి వెళ్లే సమయంలో గుంపులుగా వెళ్లడం మంచిది.
• పశువులను రాత్రి వేళల్లో తెరిచి ఉన్న ప్రదేశాల్లో వదలకుండా సురక్షితంగా కట్టివేయాలి.
• పిల్లలను అనవసరంగా బయటకు పంపకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలి.
• పులి అడుగుల ముద్రలు, అరుపులు లేదా కదలికలు కనిపించిన వెంటనే గ్రామ పెద్దలకు, అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలి.
• అటవీ శాఖ కూడా ఈ ఘటనను సీరియస్‌గా తీసుకుని పులి సంచారం ఉన్న ప్రాంతాల్లో పర్యవేక్షణను పెంచాలి.
• పోలీస్ శాఖ, గ్రామ పాలక సంస్థలు సమన్వయంతో పనిచేస్తే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.
• ఇలాంటి పరిస్థితుల్లో భయపడకుండా, అప్రమత్తతతో వ్యవహరించడం చాలా ముఖ్యం.
• ప్రజల సహకారం, అధికారుల చురుకైన చర్యలతోనే ఈ ప్రమాదాన్ని నివారించగలం ప్రజలందరూ అప్రమత్తంగా దైర్యంగా ఉండాలి అన్నారు