బండి భగీరద్ ను తక్షణమే అరెస్టు చెయ్యాలి
సీపీఎం అడ్డగూడూరు మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్
అడ్డగూడూరు 16 మే 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరద్ పై నమోదైన పొక్సో కేసులో అతన్ని వెంటనే అరెస్టు చేసి,బాధితురాలికి నాయ్యం చెయ్యాలని,సిపిఎం పార్టీ మండల కార్యదర్శి బుర్రు అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.శనివారంరోజు అడ్డగూడూరు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..నిందుతునిపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదయినా,ఇప్పటి వరకు అరెస్టు చేయకపోవడం సరికాదని,వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించి బాధితురాలికి న్యాయం చెయ్యాలని ప్రభుత్వాని కోరారు.బాధితురాలు కుటుంబసభ్యులు పిర్యాదు చేయడానికి వెళ్తే,పోలీసులు వ్యవహరించిన తీరు అత్యంత దారుణంగా ఉందని,బాధితులను స్టేషన్లో నే ఉంచి ఆ సమాచారాన్ని నిందుతులకు చేరవేశారని,నిందితులు కరీంనగర్ లోనే బాధితురాలిపై హాని ట్రాప్ కేసుపెట్టె వరకు పోలీసులు వేచిచూసి,ఆ తరువాతే పిర్యాదు స్వికరించడం చూస్తుంటే చట్టం పలుకుబడి గల వారికి చుట్టంగా మారిందనే అర్ధం అవుతుందని అన్నారు.భేటీ బచావ్ అంటూ గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించ్చారు.బీజేపీ నాయకుల నుంచే మహిళలకు,బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.గతంలో దేశాన్ని కుదిపేసిన ఉత్తరప్రదేశ్ హత్రాస్ ఘటన,మల్లయోధులపై బీజేపీ ఎంపీ బ్రజ్ భూషణ్ సింగ్ కేసుల్లో బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే నిందుతులను కాపాడే ప్రయత్నం చేసిందో,ఇప్పుడు కూడ అదే దోరని కనిపిస్తుందని పేర్కొన్నారు.బాధితురాలికి అండగా నిల్వవలసిన ప్రభుత్వం,పోలీసులు నిందితులకు కొమ్ము కాయడం సరికాదని,ఇప్పటికైనా రాజకీయ వత్తిళ్లకు లొంగకుండా నిందితుడిని వెంటనే అరెస్టు చేసి,బాధితురాలుకు రక్షణ కల్పించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు వళ్ళంబట్ల శ్రీనివాసరావు, శీలం శ్రీనివాస్,మాధను థామస్, తదితరులు పాల్గొన్నారు.