ప్రొఫెసర్ కోదండరామ్ ను కలిసి వినతి పత్రం అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రెవిన్యూ ఆఫీస్ స్లీప్పర్స్ 

Feb 28, 2025 - 20:53
 0  5
ప్రొఫెసర్ కోదండరామ్ ను కలిసి వినతి పత్రం అందించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా రెవిన్యూ ఆఫీస్ స్లీప్పర్స్ 

ఉమ్మడి ఖమ్మం జిల్లా లో రెవిన్యూ ఆఫీసులో పనిచేస్తున్న గత 30 సంవత్సరాలుగా ఆఫీసులు ఉడుస్తూ సేవలు చేస్తున్నాం అయినా కనికారం లేదు గతంలో 4000 వేల రూపాయల వేతనం ఇచ్చేవారు . ప్రస్తుతం 2000 వేల రూపాయలు ఇస్తున్నారు . ఈ 2000 కూడా 9 నెలలుగా ఇవ్వడం లేదు అంటూ హైదరాబాద్ తెలంగాణ జన సమితి నాంపల్లి ఆఫీసు కు వెళ్లి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం  తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షులును కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది . ఈ సందర్భంగా వారు రెవిన్యూ మినిస్టర్ తోటి మరియు గవర్నమెంట్ తోటి మీ జీతాలు మీ ఉద్యోగ భద్రత గురించి మాట్లాడి పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా కన్వీనర్ వి.బాబు , రాష్ట్ర నాయకులు రామనాథం , జిల్లా నాయకులు రవి , నాగేశ్వరావు , రెవిన్యూ స్లీపర్సు పొన్నపల్లి సుగుణ , తంబళ్ల అరుణ , ఎస్ కే మదర్ , బి.లక్ష్మి తదితరులు పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333