ప్రభుత్వ పాఠశాలకు దాతల సహకారం
ప్రభుత్వ పాఠశాలకు దాతల సహకారం
తెలంగాణ వార్త జనవరి 25: పెన్ పహాడ్ మండల పరిధిలోని దోసపహాడ్ గ్రామానికి చెందిన బీజేపీ బిజెపి గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీ దొంగరి పద్మ అశోక్ యుపిఎస్ దోసపాడు పాఠశాలకు భార్య( పద్మ మేడం గారి) జ్ఞాపకార్థంగా కుర్చీల కొనుగోలు కోసం శనివారం రోజు 6000 వేల రూపాయలు నగదును పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిండిగ నర్సయ్య కి అందజేసినారు. వారికి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ మామిడి వెంకన్న, రాయికింది వెంకటేశ్వర్లు, ఏ విజయ కుమారి, వెంకన్న విప్లవ కుమార్, తదితరులు పాల్గొన్నారు