ఓటు వజ్రాయుధం

Jan 25, 2025 - 19:03
Jan 25, 2025 - 19:30
 0  43
ఓటు వజ్రాయుధం

ఓటు వజ్రాయుధ ఓటర్స్ దినోత్సవ ర్యాలీ

తెలంగాణ వార్త పెన్ పహాడ్ మండలం: జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈరోజు టి జి ఎం ఎస్ అనాజిపురం ఆదర్శ పాఠశాలలో సుమారు 450 మంది విద్యార్థులతో ఆదర్శ పాఠశాల నుండి గ్రామ పంచాయితీ కార్యాలయం వరకు బ్యానర్లు కరపత్రాలతో ఉపాధ్యాయులు విద్యార్థులు ఓటు యొక్క ప్రాధాన్యత దానిని సద్వినియోగం చేసుకోవడం జీవితంలో ఒక భాగం అని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కోడి లింగయ్య ఓటు అనేది మన భవిష్యత్తు ను మార్చే ఒక వజ్రాయుధం మరియు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటును వినియోగించుకోవాలని అదేవిధంగా 18 సంవత్సరములు నిండిన యువతి యువకులు ఓటును నమోదు చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో గురు చరణ్ ,సోమయ్య, వీరారెడ్డి, సంపత్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State