ప్రపంచ రక్త దాతల దినోత్సవ సందర్భంగా

చూపు లేకపోయినా 24 మంది చైతన్యంతో రక్తదానం

Jun 14, 2024 - 16:12
Jun 14, 2024 - 18:51
 0  13
ప్రపంచ రక్త దాతల దినోత్సవ సందర్భంగా

హైదరాబాద్, 15 జూన్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- జూన్ 14 2024 న ప్రపంచ రక్త దాతల దినోత్సవ (వరల్డ్ బ్లడ్ డోనర్ డే) కార్యక్రమం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంక్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో సంస్కృతి రాజ్ భవన్ కమ్యూనిటీ హాల్ సోమాజిగూడ  హైదరాబాద్  యందు జరిగింది. ఈ సందర్భంగా బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో అంధుల లిపి సృష్టికర్త సర్ డాక్టర్ లూయిస్ బ్రెయిలీ 215 వ జయంతి వేడుక ను పురస్కరించుకొని  శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం NTR కళ ఆడిటోరియం నాంపల్లి యందు రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో 2024 జనవరి 28 న ఏర్పాటు చేసినటువంటి రక్త దాన శిబిరం ద్వారా  24 మంది  అంధ ఉద్యోగ ఉపాధ్యాయులు రక్తదానం చేశారు.

చూపు లేకపోయినా 24 మంది చైతన్యంతో రక్తదానం చేయడం  పట్ల  అభినందనలు తెలుపుతూ ఇంత గొప్ప కార్యక్రమాని చేపట్టినందుకుగాను జూన్ 14 న ప్రపంచ రక్త దాతల దినోత్సవం (వరల్డ్ బ్లడ్ డోనర్ డే) సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ స్టేట్ బ్రాంచ్ చైర్మన్ అజయ్ మిశ్రా వైస్ చైర్మన్ బుర్ర వెంకటేశం బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ కి షీల్డ్ తో పాటు ప్రశంస పత్రం అందించి సత్కరించారు. ఈ సందర్భంగా బ్లైండ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు K మల్లేశం, డాక్టర్ B, రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ రక్తదానం  చేయడం ద్వారా ఈ సమాజానికి సేవ చేసుకునే అవకాశం మాకు దక్కినట్లుగా భావిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ K అనిల్ కుమార్, స్టేట్ ట్రెజరర్ G మల్లేష్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333