**ప్రజా పాలన ముసుగులో నియంత పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్**

Sep 13, 2024 - 18:12
Sep 13, 2024 - 18:15
 0  58
**ప్రజా పాలన ముసుగులో నియంత పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్**

ప్రజాపాలన ముసుగులో నియంత పాలన చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్:-మాజీ మంత్రి, BRS పార్టీ ఎమ్మెల్యే హరీష్ రావు గారి పిలుపుమేరకు ఆందోళన చేపట్టిన బిఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అర్దరాత్రి ఇళ్ళలో నిద్రిస్తున్న వారిని ఎటువంటి సమాచారం లేకుండా అక్రమంగా అరెస్టు చేసి కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్ లో నిర్బంధించినారు. అసలు మమ్ముల్ని ఎందుకు అరెస్టు చేస్తున్నారు అని పోలీసులను అడుగగా కొద్దిసేపు అలా స్టేషన్ లో ఉంచి పంపిచేస్తాం అని మాయమాటలు చెప్పి రాత్రంతా స్టేషన్ లోనే నిర్భంధించినారు, ఈ అక్రమ అరెస్టులు, నిర్బంధాలు BRS పార్టీకి కొత్తేమి కాదని, ఈ నయవంచక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వం మమ్ములి ఎంత అణిచివేయాలని చూసినా... ఉప్పెనలా లేస్తాం మీ దుర్మార్గాలను మోసాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతాం అని BRS పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ నయీమ్ గారు హెచ్చరించారు. అర్థ రాత్రి వేళలో మమ్ముల్ని ముందస్తు అరెస్టు అంటూ అక్రమంగా నిర్బందించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని ఆయన అన్నారు. అరెస్టు అయిన వారిలో 

BRS పార్టీ టౌన్ అధ్యక్షుడు షేక్ నయీమ్, కర్ల సుందర్ బాబు, గట్ల కోటేశ్వరరావు, ఎం.డి.ఇమ్రాన్ ఖాన్, షేక్ అబ్బు, షేక్ ఆరీఫ్, పిట్టల భాగ్యమ్మ తదితరులు ఉన్నారు... 

జై తెలంగాణ జై కేసీఆర్

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State