ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

Sep 28, 2026 - 19:57
 0  1
ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి

అదనపు కలెక్టర్ నర్సింగరావు,

  జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : జావాణికి వివిధ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా ఐడిఓసి సమావేశపు మందిరంలో భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు మనోజ్ కుమార్ రెడ్డి, రాజ్ కుమార్ తో కలిసి అదనపు కలెక్టర్ ప్రజల నుంచి ఆర్జీలను స్వీకరించారు. ఈ వారం మొత్తం 65 ఫిర్యాదులు వచ్చాయన్నారు. సీఎం ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను కూడా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి బుధవారం అన్ని శాఖల అధికారులు తమ సిబ్బందితో సమావేశాలు నిర్వహించి, ప్రజావాణి ఆర్జీల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి అధికారులందరూ సకాలంలో హాజరు కావాలని, నిర్లక్ష్యం చూపే వారికి మెమోలు జారీ చేయడం జరుగుతుందని హెచ్చరించారు. దివ్యాంగులకు సంబంధించిన పోస్టుల ఖాళీల వివరాలు, రోస్టర్ పాయింట్స్ రిజిస్టర్ లను ఆయా శాఖల వారీగా ఈనెల 30వ తేదీలోగా సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు తయారు చేసిన వివిధ వస్తువులతో ప్రతి సోమవారం కలెక్టరేట్లో స్టాల్ ఏర్పాటు చేస్తుండడంతో అధికారులు, ప్రజలు, కలెక్టరేట్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333