పులి జాతీయ జంతువు అని చేతిలో చేయివేస్తామా?
10 లక్షల మందికి ఆశ్రయమిస్తుందని బాణసంచాను కొనసాగిద్దామా.
వేల కుటుంబాలు వీధిపాలైనా ఉత్పత్తిని కట్టడి చేయకపోవడం అంటే జీవితాలతో ఆడుకోవడమే.
ఉపాధి కాదు ఉనికి కూడా ముఖ్యమే!
జిలుగు వెలుగుల కాంతిరేఖలు జిమ్మీ వానసంచ మందు గుండు సామాగ్రిని పేల్చడం అనేది ఆనందంగా ఆడంబరంగా హోదాకు చిహ్నంగా భావిస్తున్నారే తప్ప ఆ కర్మాగారాలలో పని చేసే కార్మికులు వేలాదిమంది చనిపోయి కుటుంబాలు వీధిన పడుతుంటే కర్మాగారాల యాజమాన్యాలు కానీ కుటీర పరిశ్రమల వాళ్లు కానీ పట్టించుకోవడం లేదంటే అక్రమ సంపాదనకు ఆరాటపడుతున్నారు అంటే కొంత అర్థముంది. కానీ ఈ దోపిడిని, చట్టబద్ధమైన హత్యలను ఆపడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అభ్యంతరం ఏమిటి? అని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాల యొక్క లాభాపేక్ష, సాంకేతిక విభాగంలో పనిచేసే యంత్రాంగం యొక్క నిర్లక్ష్యం కారణంగా బాణసంచా తయారు చేసే కేంద్రాలలో ప్రమాదాలు ఆగడం లేదు. అన్ని సందర్భాలకు మందు గుండి సామాగ్రి పేల్చడం ఆనవాయితీగా మారిన నేపథ్యంలో మరింత సొమ్ము చేసుకోవడానికి అంతేకాదు బాగా వెలుగులు జిమ్మితే అమ్మకాలు బాగా పెరుగుతాయని అత్యాశతో కూడా మించిన స్థాయిలో రసాయనాలు పట్టిస్తున్నట్లుగా తెలుస్తున్నది. బానసంచాకు సంబంధించి ఇటీవల కాలంలో కాకినాడలోనూ అంతకుముందు అంబేద్కర్ కోనసీమ జిల్లా అనకాపల్లిలో, తమిళనాడులో, పంజాబ్, ఒడిస్సా, మహారాష్ట్ర పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో పలు కేంద్రాల్లో జరిగిన ప్రమాదాలలో ఎన్నో ప్రాణాలు బూడిదైనాయి. అయినా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నది లేదు, విచారణకు ఆదేశించినది లేదు, ఈ ఘోరకలి ఆగింది అసలే లేదు.
కొన్ని గణాంకాలు పరిశీలిద్దాం
తాత్కాలిక ఆనందం కోసం శాశ్వతంగా జీవితాలను బలిపెట్టడం ఎంత అనాగరికమో అర్థం చేసుకోవచ్చు. భారతీయ బాణసంచా పరిశ్రమలో సుమారు పది లక్షల మందికి ఉపాధి లభిస్తుండగా ఆ పరిశ్రమల యొక్క విలువ 6 వేల కోట్ల రూపాయలు .2014 నుండి 2023 మధ్య అంటే 10 సంవత్సరాలలో విధి నిర్వహణలో లోపాలు నిర్లక్ష్యం కారణంగా బాణసంచా వ్యాపార కేంద్రాలలో సుమారు 1500 సంఘటనలు చోటు చేసుకుంటే వాటిలో 1400 మందికి పైగా చనిపోయినట్లు తెలుస్తుంది. వీటి నిర్వహణకు సంబంధించి నిబంధనలను పరిశ్రమలు అమలు చేయకపోవడం, 15 కేజీలకు మించి పేలుడు పదార్థాలు ఉండకూడదు, పదిమంది కంటే ఎక్కువ సిబ్బంది ఉండరాదనీ, మంటలు చెలరేగితే తక్షణం ఆర్పేందుకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వ నిబంధనలు హె చ్చరిస్తుంటే చాలా చోట్ల ఈ సౌకర్యాలు ఏవి లేకపోవడం వలన ప్రమాదాలు యదేచ్ఛగా జరుగుతున్నాయి. నిపుణులైన శ్రామికులను తక్కువ స్థాయిలో నియమించవలసిన బదులు తక్కువ వేతనాలు ఇస్తూ ఎక్కువమంది బాల కార్మికులను పెట్టుకోవడం వలన కూడా ప్రమాదాల్లో ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అవుతున్నది. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ పరిశ్రమలో పేలుడు పదార్థాలు 100 కిలోలకు పైగా ని లువ ఉన్నట్లు పదిమందికి బదులు 50 మంది కార్మికులు ఉన్నట్లు తెలుస్తున్నది. అధికారుల నిఘా సక్రమంగా లేని కారణంగా కాకినాడలో జరిగిన ప్రమాదంలో 22 నిండు జీవితాలు బూడిదైన విషయం అధికారుల నిర్లక్ష్యానికి ప్రభుత్వాల అలసత్వానికి మచ్చుతునక.
ఈ గోరకలిని ఆపలేమా?
ఈ పరిశ్రమ ద్వారా ఉత్పత్తి అయ్యే వస్తువులు కడుపు నింపేది కాదు, గృహోపకరణాలు అంతకు కాదు, ప్రమాదముతో కూడుకున్న పేలుడు వస్తువులు. మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుగా తినడానికి తిండి లేనటువంటి పేద కార్మికులను ఆశజూపి పొ ట్టగొట్టి తక్కువ వేతనాలకు తీసుకొని ఈ కర్మ గారాలలో ప్రాణాలే తీస్తున్నారంటే వీటికి చట్టబద్ధత ఉన్నా లేకపోయినా వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాలి. పేలుడు పదార్థాలను బాణసంచాను అన్ని స్థాయిలలో వినియోగించడాన్ని రద్దు చేయాలి. వీటి వినియోగం పరిశ్రమల నడపడం వలన ఎంతో మంది చనిపోతున్నారు కనుక ఈ కర్మాగారాలు నిర్వాహకులు, వినియోగదారుల పైన కూడా హత్య నేరం మోపాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 10 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ అని దీనిని కొనసాగిద్దామా? లక్షలాది కోట్లాదిమందికి ఉపాధి కల్పిస్తున్నదని సిగరెట్లు బీడీల పరిశ్రమను ఇప్పటికీ కొనసాగించడంఅంటే మద్యపానం బీడీలు, సిగరెట్ ఉత్పత్తిలో వేలాదిమంది కార్మికులకు అనారోగ్యాన్ని, అనర్థాలను తెచ్చి పెట్టే ఉత్పత్తియే కదా! బా నసంచాతో పాటు ఈ మత్తు పదార్థాలు అన్నింటిని నిర్మూలించడం ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ నిబద్ధతను చాటుకోవాలి. .రాజ్యాంగబద్ధంగా వీటి ఉత్పత్తికి వినియోగానికి ఉన్నటువంటి అవకాశాలు అనుమతులు ఏమిటో న్యాయ పరిధిలో పరిశీలించి ప్రమాదకరమైనవి కనుక నిర్బంధంగా మూసి వేయించాలి. పులి మన జాతీయ జంతువు అని గౌరవంగా ఎంపిక చేసుకున్నాం అంతేకానీ దాని చేతిలో చేయి వేస్తే అది చంపకుండా ఊరుకుంటుందా? బాణసంచా కర్మాగారంలో పేలుడుకు సంబంధించిన పదార్థాల వినియోగమే ఎక్కువ మరింత బాగా పని చేయాలని ఎక్కువ మొత్తంలో రసాయనాలు కలుపుతున్నట్లు తెలుస్తున్నది. అలాంటప్పుడు పే లకుండా మానవు చనిపోకుండా మిగలరు.
ఈ తెలిసిన వాస్తవాన్ని దా యడం ఎందుకు? ఈ ప్రాణాలు తీసే ఉపాధి అవకాశాలను రద్దుచేసి విభిన్న మార్గాలను అన్వేషించాలి. పేద వర్గాలకు స్వయం ఉపాధి పథకాలను కల్పించడం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుంది కదా! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 సంవత్సరంలో ప్రభుత్వ నియమించిన కమిటీ మొక్కుబడిగా చేసిన సూచనలు గమనిస్తే ముడి పదార్థాల కొనుగోలు తయారీ నిలువ విక్రయాల వంటి వాటిపైన పర్యవేక్షణ చేయాలని, బాణసంచా తయారీ పైన కార్మికులకు అవగాహన కల్పించాలని, అత్యవసరం పరిస్థితుల్లో ఎలా బయటపడాలో శిక్షణ ఇవ్వాలని సూచించినటువంటి ఆ కమిటీ మాత్రం ప్రమాదకరం మూసివేయాలని సిఫారసు చేయకపోవడం విడ్డురం. ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ దేహాలతో ఆడుకుంటున్న సమస్య. దీనిని జాతీయ సమస్యగా భావించి కేంద్ర ప్రభుత్వం ఎ లాంటి నిబంధనలను విధించకుండా పూర్తిగా నిషేధించడమే ఏకైక మార్గం.
వీటి వినియోగం వలన వాతావరణం కాలుష్యం కావడంతోపాటు హానికారక పదార్థాలు గాలిలో కలిసిపోవడంతో పలు రోగాలకు కారణమవుతున్నది. ఢిల్లీ వంటి కేంద్రాలలో ఇప్పటికీ శీతాకాలంలో కనీసం శ్వాస కూడా తీసుకోలేని దుస్థితి ఉన్న విషయం మనందరికీ తెలుసు. అలాంటి దుస్థితిని దేశవ్యాప్తంగా చూడాలనుకుంటున్నారా? కట్టడి చేయడానికి ఆటంకం ఏమిటి? బహుశా రాజకీయ నాయకులకు సంబంధించి ఎక్కువగా వినియోగించే అవకాశం ఉన్న వీటిని రద్దు చేయడానికి సంకో చ పడుతున్నారో ఏమో? కానీ ఈ ప్రమాదాలలో చనిపోయేది కేవలం కార్మికులు మాత్రమే కాదు వినియోగించే రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ఇతరులు అని తెలుసుకుంటే మంచిది. "ప్రమాదంతో చెలగాటం క్రూర జంతువులతో నవ్వులాట వంటి ఈ బా నసంచ కర్మాగారాలను మూసి వేయించి వాటిపై ఆధారపడిన కార్మికులకు ఇతర రంగాల్లో ఉపాధి కల్పించడం ద్వారా భవిష్యత్తులో దుర్వార్తలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఉపాధి మాత్రమే కాదు మనిషి ఉనికి కూడా చాలా అవసరం. విజయోత్సవాలు ఆనందాలను పంచుకోవడానికి బాణాసంచా మాత్రమే ముఖ్యం కాదు. అనేక అవకాశాలు సన్నివేశాలు మనం కల్పించుకోవచ్చు. అంతెందుకు బానసంచాను ముఖ్యంగా పండుగలు దీపావళి దసరా సందర్భంలో కాల్చే చోట ఎంతోమంది చిన్న పిల్లలు ప్రమాదాల బారిన పడి అవయవాలను కోల్పోతూ అవిటి వాళ్ళు అవుతున్న విషయం పాలకులకు తెలియదా ?"
--- వడ్డేపల్లి మల్లేశం
(ఈ వ్యా వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకులు అ రసo రాష్ట్ర కమిటీ సభ్యులు నాబా జిల్లా సిద్దిపేట తెలంగాణ )