పీడిత ప్రజల గొంతుక జలగంజానికి రాములు విగ్రహానికి పూలమాల

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ పీడిత ప్రజల గొంతుక జ న్ను బాయ్ జలగంజానికి రాములు అలియాస్ జున్ను బాయ్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీడిత ప్రజల గొంతుకగా నిలబడ్డాడని తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మార్జున్ అన్నారు గోదావరి లోయ పోరాట యోధుడు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు జన్ను భాయ్ జయంతిని పురస్కరించుకుని ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ధర్మార్జున్ మాట్లాడుతూ ఆత్మకూరు మండలం ఏపూరి గ్రామంలో పేద కుటుంబంలో జన్మించిన జానకి రాములు నక్సల్బరీ వసంతం మేఘ గర్జన పిలుపునందుకొని ప్రజల పక్షాన పోరాడాలని ఆయన కొనియాడారు అజ్ఞాత జీవనం కొనసాగిస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పలు ప్రజా ఉద్యమాలు నిర్వహించడంలో కీలకపాత్ర పోషించారని అన్నారు గ్రామ స్థాయి కార్యకర్తగా విప్లఉద్యమంలో అడుగిడి రాష్ట్రస్థాయి నాయకుడిగా ఎదిగాడని చివరి శ్వాస వరకు ప్రజా ఉద్యమాలతో మమేకమైనా రని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు బండి రవి ప్రజాసంఘాల నాయకులు కందాల వెంకటరెడ్డి ,దండి ప్రవీణ్ ,కొల్లు శ్రీను తదితరులు పాల్గొన్నారు.