పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినప్పుడు కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయి

తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్..

Apr 17, 2026 - 17:17
Apr 17, 2026 - 17:26
 0  1
పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినప్పుడు కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయి
పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినప్పుడు కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయి
పాలకులపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడినప్పుడు కొత్త పార్టీలు ఆవిర్భవిస్తాయి

సూర్యాపేట టౌన్ 17 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- తెలంగాణ ప్రజలు ఊహించిన ప్రత్యేక రాష్ట్రం రాలేదని సంపూర్ణ సర్వోదయ తెలంగాణ ఏర్పాటు కోసం కవితక్క ప్రజల్లో కెళ్ళి పోరాడుతున్నదని తెలంగాణ జాగృతి స్టీరింగ్ కమిటీ సభ్యులు సయ్యద్ ఇస్మాయిల్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని ఎస్ ఆర్ ఎన్ ఫంక్షన్ హాల్లో జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో  నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. అసమర్ధ ప్రభుత్వాలపై ప్రజలు తిరుగుబాటు సమయంలో కొత్త పార్టీలు ఆవిర్భవించడం సహజమేనని అన్నారు . రాష్ట్రం లో ప్రధాన పార్టీలు అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీలు ప్రజల కు ఏంమేలు చేశాయని వ్యాఖ్యానించారు. నిరుద్యోగం గంజాయి, అరాచకాలు, ప్రాజెక్టుల సమస్యల తో పాటు రైతు సంక్షేమాన్ని సైతం గాలికొదిలేసి ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తప్ప ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. పదేళ్ల బిఆర్ఎస్ పాలన రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు రాష్ట్రo ఏర్పడిందన్న పేరే తప్ప ఒరిగిందేమీ లేదని దుయ్యబడ్డారు.

జాగృతి కవితక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు పర్యటించిన సందర్భంలో ప్రజలు రాష్ట్రం ఏర్పడిందన్న సంతృప్తిగా లేరని గమనించి ప్రజా సమస్యలను పరిష్కార మార్గంలో తేచ్చేందుకు కొత్తగా పార్టీ ఏర్పాటు చేసి ప్రజల ముందుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని ప్రభుత్వాలు అధికారంలో ఉండడానికి ఏమాత్రం తగదని ఆయన అన్నారు. ప్రజల బాగోగుల కంటే పార్టీల నాయకులు వారి పదవులు కాపాడుకోవడం ,ఆస్తులు సంపాదించుకోవడానికి ప్రాధాన్యతరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దశాబ్దాలుగా నెలకొని ఉన్న సమస్యలను కాంగ్రెస్ గాని బిఆర్ఎస్ గాని పరిష్కార మార్గం చూపలేదు అన్నారు. అందుకే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా నూతనంగా పార్టీ ఏర్పాటు చేసి ప్రజలను మమేకం చేసుకొని ఉద్యమాల దిశగా కవితక్క అడుగులు వేస్తుందని కవితక్క ఆశయాలకు ప్రజల మద్దతు వారి దీవెనలు ఉంటాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా ఈనెల 25న నూతన పార్టీ ఆవిర్భావ పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమం లో రాష్ట్ర నాయకులు మందడి సోమిరెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు నల్లపోతు సైదిరెడ్డి, నీల ఉమారాణి, మాధవి డి, శ్యాం నాయక్, గజవెల్లి ఉప్పలాచారి, నకరికంటి సతీష్, గణపారపు శ్రీకాంత్, నకరికంటి చిరంజీవి, పిట్టల మహేష్, రఘు నాగమణి నీలిమ గీత, ధారావత్ ప్రవీణ్  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333