పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

Mar 13, 2026 - 20:06
Mar 13, 2026 - 20:53
 0  1
పదో తరగతి విద్యార్థులకు ఆల్ ది బెస్ట్

పది విద్యార్థులకు ఆల్ ది బెస్ట్...

 సమాచార హక్కు వికాస సమితి..సర్వేశ్వరావు - సరిత 

వాజేడు, మార్చి 13 (తెలంగాణ వార్త ) :  పదవ తరగతి వార్షిక పరీక్షల రాయబోతున్న విద్యార్థినీ, విద్యార్థులకు సమాచార హక్కు వికాస సమితి తరుపున, ములుగు జిల్లా అధ్యక్షులు & వాజేడు మండల్ ఉమెన్ ప్రెసిడెంట్ - యాలం సర్వేశ్వరరావు -సరిత దంపతులు శుభాకాంక్షలుతెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...విద్యార్థుల జీవితంలో పదవ తరగతి పరీక్షలు అత్యంత కీలకమైనవని పేర్కొన్నారు. జీవితంలో మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్నందున విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దని, ఒత్తిడి లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని సూచించారు.

ప్రతి విద్యార్థి పరీక్షల్లో మంచి ప్రతిభ కనబరిచి, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎస్ హెచ్ వి ఎస్ దంపతులు ఆకాంక్షించారు. తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ మండల పేరును నిలబెట్టాలని కోరుతూ విద్యార్థులందరికీ ' మరోసారిశుభాకాంక్షలు తెలియజేశారు.

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్