తెలుగు ప్రజలకు మహా శివరాత్రి శుభాకాంక్షలు
చర్లపల్లి గిరీష్ కుమార్ ఎడిటర్

మహా శివరాత్రి పండగ పర్వదినాన్ని పరిష్కరించుకొని మంగళవారం ఎడిటర్ చర్లపల్లి గిరీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ భక్తులు శివరాత్రి పండుగను అంగరంగ వైభవంగా ఘనంగా జరుపుకోవాలని తెలంగాణ ఆంద్ర ప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నామని పేర్కొన్నారు. శివ జాగరణలో పరమ శివుడిని భక్తి శ్రద్ధలతో కొలిచి, కోర్కెలు నెరవేర్చుకోవాలన్నారు. శివుని కృపతో తెలంగాణ ఆంద్ర ప్రదేశ్ ప్రజలందరికీ మంచి ఆయురారోగ్యాన్ని, అష్టయిశ్వర్యాలను, సుఖశాంతులను అందించాలని, ఆ భోళాశంకరుని ఆశీర్వాదం ప్రజల అందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.