తెలంగాణ ఎస్సీ అండ్ ఎస్టీ జిల్లా అధ్యక్షులుగా ఏంఆర్ రవిందర్ సెక్రటరీ బోట్ల రాజేశ్వర్
డివిజన్ అధ్యక్షులుగా బాలెంల దుర్గయ్య సెక్రటరీ యాదగిరి ఏకగ్రీవంగా ఎన్నిక
అడ్డగూడూరు 24 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ అండ్ ఎస్టీ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ 202/2010 యాదాద్రి భువనగిరి జిల్లా సర్వసభ్య సమావేశం భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ దగ్గర అచ్యుత్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర సెక్రటరీ జనరల్ మాతంగి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఆయనతో పాటు టీజీస్పడీసీల్ కంపెనీ సెక్రటరీ ఎస్ రాములు ట్రాన్స్కో ప్రెసిడెంట్ పి రాజనర్సు,సరూర్ నగర్ ప్రెసిడెంట్ పి రవీందర్ హప్సిగూడ సర్కిల్ ప్రెసిడెంట్ ఇ జనార్ధన్ భువనగిరి ఏఈ సాయి కృష్ణ ఆధ్వర్యంలో యాదాద్రి జిల్లా మరియు భువనగిరి డివిజన్ నూతన కమిటీ ఏకగ్రీవంగాఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర సెక్రటరీ జనరల్ మాతంగి శ్రీనివాస్ మాట్లాడుతూ..ఈ అసోసియేషన్ కార్మికుల పక్షపాతిగా పనిచేస్తూ ట్రేడ్ యూనియన్లకు దీటుగా కార్మికుల సమస్యలపై పోరాడుతుందని గుర్తు చేశారు.యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులుగా ఎం ఆర్ రవీందర్ జిల్లా సెక్రెటరీగా బొట్ల రాజేశ్వర్ చీప్ అడ్వైజర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే నరసింహ వైస్ ప్రెసిడెంట్లుగా వంగాల మల్లేష్,చీఫ్ అడ్వైజర్ పాపులు ఆడెపు శ్రీకాంత్ అసిస్టెంట్ సెక్రెటరీగా నల్ల మహేష్ జిల్లా సలహాదారు పాపులు తదితరులను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు. భువనగిరి డివిజన్ అధ్యక్షులుగా బాలెంల దుర్గయ్య,డివిజన్ సెక్రెటరీగా కందుకూరు యాదయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ బొట్ల నరేష్,వైస్ ప్రెసిడెంట్ పొడిచేటి మహేష్, గోవర్ధన్, బద్దుల శివ తదితరులు ను ఎన్నుకోవడం జరిగింది.