డ్రగ్స్ నిర్మూలన కై వారం రోజులపాటు అవగాహన కార్యక్రమాలు
మాదక ద్రవ్యాల నిర్మూలన, పిల్లల భద్రత అందరి బాధ్యత
సూర్యపేట, 26 ఏప్రిల్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం సూచించిన 5వ అంశం పిల్లల భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలన పై జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ అధ్వర్యంలో సోమవారం నుండి వారం రోజుల పాటు ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని జిల్లా ఎస్పి నరసింహ అన్నారు, దీని కోసం సంభందిత ప్రభుత్వ శాఖలతో సమన్వయంగా పని చేస్తాం అన్నారు. అన్ని గ్రామాలకు పోలీసు సిబ్బంది వెళ్లి డ్రగ్స్ వల్ల జరుగుతున్న అనర్థాల గురించి, పిల్లల, యువత భవిష్యత్తుపై దుష్ప్రభావం గురించి వివరించడం జరుగుతుంది, డ్రగ్స్ వినియోగం వల్ల భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు, మత్తుకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారు. మన పిల్లలు మన సమాజాన్ని మాదకద్రవ్యాల బారినుండి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నది అని తెలిపినారు. గంజాయి సరఫరా, వినియోగం పై నిఘా ఉంచడం జరిగినది గతంలో గంజాయి కేసుల్లో ఉన్న వారిపై, వినియోగించే వారిపై పోలీసు నిఘా ఉంచాం, వీరికి కౌన్సిలింగ్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము అన్నారు.
అవగాహన కార్యక్రమాల్లో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, యువత భాగస్వామ్యం కావాలని మాదకద్రవ్యాల రహిత ఆరోగ్యకర సమాజ నిర్మాణం లో భాగస్వామ్యం కావాలని కోరారు.