చివరిదశ ఊపిరితిత్తుల వైఫల్యానికి అత్యంత అధునాతన వైద్యం అందుబాటులోకి

Jul 15, 2026 - 19:45
 0  1
చివరిదశ ఊపిరితిత్తుల వైఫల్యానికి అత్యంత అధునాతన వైద్యం అందుబాటులోకి

ఎక్మో (ECMO) విధానంతో ఊపిరితిత్తుల చికిత్సలో సరికొత్త విప్లవం!

యశోద హాస్పిటల్స్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ వెల్లడి

ఖమ్మం : యశోద మెడికల్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్స్ కన్సల్టెంట్ ట్రాన్స్‌ప్లాంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ తపస్వి కృష్ణ కాత్రగడ్డ మాట్లాడుతూ తీవ్రమైన శ్వాసకోశ సమస్యలతో , ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకునే రోగులను కాపాడటంలో ‘ఎక్మో’ ( కృత్రిమ గుండె - ఊపిరితిత్తుల పరికరం ) విధానం ఒక సంజీవనిలా మారుతోందని తెలిపారు . ఈ అత్యంత సంక్లిష్టమైన వైద్య విధానం (ECMO Support with Lung Transplantation) యొక్క విశిష్టతను మరియు మౌలిక సదుపాయాల వివరాలను వెల్లడించారు . ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రాష్ట్రాల్లోని రోగులకు అంతర్జాతీయ స్థాయి క్రిటికల్ కేర్ వైద్య సదుపాయాలు ఏ విధంగా అందుబాటులోకి వచ్చాయో వివరించడానికి , చివరి దశ ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తుల్లో భరోసా నింపడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు . ప్రాణం నిలిపే ‘ఎక్మో’ (కృత్రిమ శ్వాస వ్యవస్థ) విధానం చివరి దశ ‘ఇంటర్‌స్టీషియల్ లంగ్ డిసీజ్’ (ILD) లేదా శ్వాసకోశ వైఫల్యం వల్ల ఊపిరితిత్తులు రక్తానికి ఆక్సిజన్‌ను అందించే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయినప్పుడు ఈ ‘వెనో - వీనస్ ఎక్మో’ (ECMO) లైఫ్ సపోర్ట్ విధానాన్ని ఉపయోగిస్తామని అన్నారు . ఈ విధానంలో అత్యాధునిక యంత్రం శరీరం వెలుపల ఉంటూ కృత్రిమ ఊపిరితిత్తుల వ్యవస్థలా పనిచేస్తుంది . ఇది శరీరం నుండి ఆక్సిజన్ లేని చెడు రక్తాన్ని గ్రహించి దానికి పూర్తి ఆక్సిజన్‌ను అందించి కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి మళ్లీ శరీరంలోకి పంపుతుంది . ఊపిరితిత్తుల మార్పిడి అవసరమైన రోగులకు , దాత దొరికేవరకు (Bridge to Transplant) ప్రాణాలను నిలిపి ఉంచడానికి ఈ సాంకేతిక విధానం అత్యంత కీలకమైనదని డాక్టర్ తపస్వి వివరించారు . సెకన్ల సమన్వయంతో సాగే అవయవ మార్పిడి ఈ ఎక్మో విధానంలో ఉన్న రోగులకు ఊపిరితిత్తుల మార్పిడి (Double Lung Transplant) చేయడం వైద్యశాస్త్రంలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ . రక్తం గడ్డకట్టడం , అధిక రక్తస్రావం వంటి తీవ్రమైన సాంకేతిక ప్రమాదాలను అధిగమిస్తూ.. గుండె - ఊపిరితిత్తుల నిపుణులు , అనస్థీషియా వైద్యులు , ఐసీయూ నర్సింగ్ బృందం సెకన్ల సమన్వయంతో వ్యవహరించి ఈ సుదీర్ఘ శస్త్రచికిత్స ప్రక్రియను విజయవంతం చేయాల్సి ఉంటుందని , ఊపిరితిత్తుల వ్యాధి చివరి దశకు చేరినంత మాత్రాన ఆశలు వదులుకోవాల్సిన అవసరం లేదని , ఎక్మో వంటి అధునాతన మౌలిక సదుపాయాలతో కూడిన వైద్య విధానం ద్వారా ప్రాణాలు నిలపడం సాధ్యమేనని స్పష్టం చేశారు . విజయవంతమైన రికవరీ విధానం శస్త్రచికిత్స అనంతరం అందించే ప్రత్యేక అంతర్జాతీయ క్రిటికల్ కేర్ ప్రోటోకాల్స్ ద్వారా రోగులను ఎక్మో యంత్రం మరియు వెంటిలేటర్ల నుండి సురక్షితంగా తొలగించి , కొత్త ఊపిరితిత్తులతో స్వయంగా శ్వాస తీసుకునేలా చేస్తామని. ఆ తర్వాత క్రియాశీల శారీరక వ్యాయామాల ప్రక్రియ (రిహాబిలిటేషన్) ద్వారా రోగులు సాధారణ జీవితాన్ని గడిపేలా ఈ చికిత్సా విధానం తోడ్పడుతుందని డాక్టర్ తపస్వి వివరించారు . ఈ కార్యక్రమంలో యశోద హాస్పిటల్స్ సీనియర్ మేనేజర్ పరమేష్ , అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణ పాల్గొన్నారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333