చిన్నంబావి కేజీబీవీ స్కూల్ ను పర్యవేక్షించిన జూపల్లి అనుచరులు
14-08-2026 తెలంగాణ వార్త ప్రతినిది చిన్నంబావిమండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతంలో KGBV స్కూల్ ను పర్యవేక్షించిన చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు. చిన్నంబావి మండలంలో KGBV స్కూల్లో ప్రధాన సమస్యలను మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు,దృష్టికి తీసుకెళ్లాలని చిన్నంబావి మండల కేంద్రంలోని KGBV స్కూల్లో ప్రధాన సమస్యలను S O మేడం ద్వారా తెలుసుకొని క్లాస్ రూమ్ లో బెంచెస్ హాస్టల్ రూమ్ లో బెడ్స్ వాటర్ ఫెసిలిటీ కొరత లేకుండా మెనూ ప్రకారం ఫుడ్ క్వాలిటీ తో విద్యార్థినిలకు పెట్టి వారికి ఆరోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పి, ప్రతి క్లాసులో విద్యార్థినీలను పలకరించి వారి సమస్యలు తెలుసుకుని వారిని మంచి వాతావరణంలో పరిశుభ్రతను పాటిస్తూ చక్కగా చదువుకోవాలని సూచించారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తామని చెప్పారు
ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రామచంద్ర రెడ్డి గారు. కృష్ణ ప్రసాద్ గారు. జంగ బీచ్పల్లి యాదవ్ గారు. వడ్డెమాను బిచ్చన్న గారు. తేజ రెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు.