ఘనంగా బేతెస్థ చర్చ్ ఖాసీంపేట లో నూతన సంవత్సర ఆరాధన
బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్ హెప్సిబా
జనవరి 01 బుధవారం స్థానిక ఖాసీంపేట 4వ వార్డు సూర్యాపేట బేతెస్థ ప్రార్ధన మందిరం నందు బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్- కరుణ శ్రీ (హెప్సిబా ) ఆధ్వర్యంలో ఘనంగా నూతన సంవత్సర ఆరాధనా నిర్వహించడం జరిగింది.ఈ సందర్బంగా కేక్ కట్ చేసి స్విట్స్, అరటి పండ్లు పంచిపెట్టినారు. ఈ సందర్బంగా బిషప్ దుర్గం ప్రభాకర్ ప్రజలందరికి, భక్తులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ యేసు క్రీస్తూ ఆశీస్సులతో 2025 లో సుఖసంతోషాలతో,ఉండాలని భక్తులను దీవించారు. ఈ కార్యక్రమం లో మీసాల తీతు, శీలం రామన్న ,యడవెల్లి యేసుపాదం,ఆదిమాళ్ళ బాబు, మామిడి వెంకన్న, మామిడి కిరణ్,రామకృష్ణ, సుధాకర్, వెంకన్న, చందర్ రావు తదితరులు పాల్గొన్నారు