గంజాయి సేవిస్తూ ఇద్దరు యువకులు అరెస్ట్
గంజాయి సేవిస్తూ ఇద్దరు యువకులు అరెస్ట్
తెలంగాణ వార్త మహబూబాబాద్ 15, 2026 : మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని ప్రతిపాక, మంగలి కాలనీల్లో గంజాయి సేవిస్తున్న ఇద్దరు యువకులను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దాడుల్లో తాళ్ల అభిషేక్, నాయిని ఈశ్వర్ పట్టుబడ్డారు. వీరి వద్ద నుంచి 12 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, గంజాయి విక్రయించినా, సేవించినా కఠిన చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.