కుమారుడిని ప్రభుత్వ బడిలో చేర్పించిన సర్పంచ్

Jun 19, 2026 - 15:00
 0  4
కుమారుడిని ప్రభుత్వ బడిలో చేర్పించిన సర్పంచ్

​ప్రభుత్వ పాఠశాల పై మమకారం.. 

ప్రభుత్వ బడిలోనే నాణ్యతమైన విద్య

 తిరుమలగిరి 19 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

నేటి కాలంలో సామాన్యుడి నుండి ప్రజాప్రతినిధుల వరకు అందరూ తమ పిల్లలను ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పించడానికి మొగ్గు చూపుతుంటే, తిరుమలగిరి మండలం కోక్య నాయక్ తండ సర్పంచ్ మాత్రం అందుకు భిన్నంగా ఆలోచించారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో నమ్మకం కలిగించాలనే ఉద్దేశంతో తన కుమారుడిని స్థానిక ప్రభుత్వ బడి లాక్య తండా లో చేర్పించి అందరికీ ఆదర్శంగా నిలిచారు."ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, ప్రజల్లో సర్కారు బడుల పట్ల నమ్మకం, మమకారం కలిగించాలనే ఉద్దేశంతోనే  కుమారుడిని ఇక్కడ చేర్పించాను."అని   గుగులోతు ప్రేమ్ ప్రసాద్, సర్పంచ్  తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం ఉపాధ్యాయ బృందం గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి