కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి.
కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ వేతనాలను 26 వేల కు పెంచాలి.
ఐ ఎఫ్ టి యు డిమాండ్
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్ లుగా క్రోడీకరించి కార్మిక హక్కులను కాల రాయడాన్ని తక్షణమే విరమించుకోవాలని ఐఎఫ్ టి యు జాతీయ కమిటీ పిలుపుమేరకు సూర్యాపేట జిల్లాలో కలెక్టర్ గారికి ప్రతినిధి బృందం మెమోరాండం అందజేశారు.
ఈ సందర్భంగా *ఐఎఫ్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి గంట నాగయ్య, కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు డి. నరసమ్మ* పాల్గొని మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దుచేస్తూ, కార్మిక హక్కులను నిరాకరిస్తూ, కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలకు అనుకూలంగా లేబర్ కోడ్ లలో అనేక అంశాలను పొందుపరిచి కార్మిక వర్గాన్ని విస్మరిస్తున్నారని ఈ విధానం దేశ మానవ అభివృద్ధికి నష్టకరమైనది అన్నారు. రాజ్యాంగం లోని పీఠికలో, ఆదేశిక సూత్రాలలో, ప్రాథమిక హక్కుల ప్రామాణికంగా కోడులలో కార్మికుల యాజమాన్యలకు మధ్య వచ్చే వివాదాలను న్యాయబద్ధంగా ఎలా పరిష్కారం చేసుకోవాలో పొందుపరచాలి,కనీసం కార్మిక సంఘాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా మోడీ ప్రభుత్వం నియంతత్వ ధోరణిలో వ్యవహరిస్తుందని విమర్శించారు. కార్మికులు యూనియన్లు ఏర్పాటు చేసుకుని హక్కును యాజమాన్యాలతో బ్యారసారాలు చేసుకునే హక్కును సమ్మె చేసే హక్కు లకు తూట్లుపొడుస్తూ నిర్ణయం తీసుకోవడం అన్యాయం అని అన్నారు. లేబర్ కోడు లను ఏప్రిల్ ఒకటి నుండి అమలు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. తక్షణమే ఈ కోడులను రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కస్తూర్బా గాంధీ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ వర్కర్లకు కనీస వేతనాలను పెంచకుండా వారితో వెట్టిచాకిరి చేయించుకుంటుందని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను 26 వేల రూపాయలకు పెంచాలని, ఉద్యోగ భద్రత, పిఎఫ్, ఈఎస్ఐ,ప్రమాద బీమా, గ్రాట్యూటీ,రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష అభియాన్ జేఏసీ ఆధ్వర్యంలో గత సంవత్సరం నెల పాటు సమ్మె నిర్వహించారూ. దీనిలో నాన్ టీచింగ్ వర్కర్లు పాఠశాలలో విద్యార్థులకు అందరికీ సమ్మె కాలంలో భోజనాలు వడ్డించిన, సేవలు అందజేసిన వారి వేతనాలను కోత విధించారని తక్షణమే వారి వేతనాలను వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు కునుకుంట్ల సైదులు, జిల్లా కమిటీ సభ్యులు సామా నర్సిరెడ్డి, దాసరి శ్రీనివాస్, కేజీబీవీ నాన్ టీచింగ్ వర్కర్స్ అసోసియేషన్ నాయకులు జానీ బేగం, అమిద, మమత తదితరులు పాల్గొన్నారు.