ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి

Feb 5, 2026 - 08:11
Feb 5, 2026 - 08:12
 0  6
ఓబీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేయాలి

 జనగణన కాలమ్ లో ఓబీసీలకు బాక్సును కేటాయించాలి 

 ఓబీసీలను మరోసారి మోసం చేసేందుకు బిజెపి కుయుక్తులు

 బీ సీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు ఘాటు విమర్శ

 దేశవ్యాప్తంగా పలు బీసీ సంఘాలు దశాబ్దాల కాలంగా చేస్తున్న పోరాట ఫలితంగా దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం జనగణలో కుల గణన చేసేందుకు ముందుకు వచ్చిందని బీసీ హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిధూళిపాళ ధనుంజయ నాయుడు అన్నారు.

 బుధవారం నాడు ఆయన సూర్యాపేట జిల్లా గరిడేపల్లిలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలో...

 ఒకపక్క బీసీ కులగణన చేపడతామని చెప్తున్న బిజెపి ప్రభుత్వం,, జన గణనకోసం తయారు చేసిన 33 ప్రశ్నలతో కూడిన పత్రావళి లో 12వ ప్రశ్నగా ఏర్పాటు చేసిన కాలమ్ లో నీవు ఎస్సివా,, ఎస్టీవా లేదా ఇతరులలో ఉన్నారా అని అడిగారే గాని ఓబిసివా అనే కాలమ్ లేకుండా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

 ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా బీసీలకు తీరని అన్యాయం చేశారని బీసీల జనాభా దామాషా ప్రకారం బడ్జెట్లో 50% నిధులు బీసీల అభివృద్ధి కొరకు కేటాయించాల్సి ఉండగా కనీసం రెండు లక్షల కోట్లైనా విడుదల చేయాలని బీసీ హక్కుల సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చి ఉన్నామని అయినప్పటికీ కూడా బీసీల పట్ల సవతి తల్లి ప్రేమ చూపించడం బిజెపికి దాని మిత్ర పక్షాలకు తగదని ఆయన అన్నారు

 ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఓబీసీలకు చెందిన ఎంపీలు అందరూ పార్టీలకతీతంగా మౌనం వీడి తక్షణమే ఓబీసీ కాలమ్ బాక్సును ఏర్పాటు చేయాలని

 మొదటినుంచి బిజెపి పార్టీ బీసీ వ్యతిరేక విధానాలనే అవలంబిస్తున్నదని మరొకసారి బీసీలను మోసం చేసేందుకు బిజెపి సిద్ధపడుతున్నదని అందువల్ల బీసీలు ఐక్యమై బిసి వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి పార్టీకి బీసీ ఓటర్లు తగు రీతిలో గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333