ఎఫ్ ఎల్ ఎస్ బోధనను పరిశీలించిన ఎంఈఓ

Jul 9, 2026 - 15:35
Jul 9, 2026 - 15:37
 0  6
ఎఫ్ ఎల్ ఎస్ బోధనను పరిశీలించిన ఎంఈఓ
ఎఫ్ ఎల్ ఎస్ బోధనను పరిశీలించిన ఎంఈఓ

జోగులాంబ గద్వాల 9జులై 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలంలోని గోపాల్ దీన్నే గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల శాలకు వెళ్లి ప్రేయర్ కార్యక్రమంలో పాల్గొన్నారు.  తదనంతరం ఎంఈఓ వెంకటేశ్వర్లు ఫౌండేషనల్ లిటరసి అండ్ న్యూ మారాసి కార్యక్రమం అమలును పరిశీలించారు.  ఈ సందర్భంగా ఎంఈఓ వెంకటేశ్వర్లు..మాట్లాడుతూ... విద్యార్థులు చదవడం రాయడం గణిత నైపుణ్యాలను పరీక్షించి వారి అభ్యాసనస్థాయిని తెలుసుకున్నానని తెలిపారు.  తరగతి గదిలో ఉపాధ్యాయుల బోధన విధానాన్ని పరిశీలించి ప్రతి విద్యార్థి మౌలిక అక్షరాస్యత గణిత నైపుణ్యాలను నిర్దేశిత స్థాయిలో సాధించేలా ప్రత్యేక చొరవ చూపాలని పేర్కొన్నారు  ప్రభుత్వం అమలు చేస్తున్న పి ఎల్ ఎస్ లక్ష్యాలను అనుగుణంగా నాణ్యమైన బోధన అందించాలని ఉపాధ్యాయులకు ఎంఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. అలాగే విద్యార్థిని విద్యార్థులకు మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందించాలని ఏజెన్సీలకు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని లేని ఎడల శాఖ  పర్యమైనా చర్యలు ఉంటాయని ఉపాధ్యాయులకు చూసినట్లు ఎంఈఓ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఉపాధ్యాయులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State