ఉదయం 11 అయినా తీయని ప్రభుత్వ పల్లె దవఖాన తాళం

Dec 12, 2024 - 20:28
 0  7
ఉదయం 11 అయినా తీయని ప్రభుత్వ పల్లె దవఖాన తాళం

అడ్డగూడూరు 12 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో చౌల్లరామారo గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం పల్లె దావకానకి సమయపాలన ఉండదా..ఉంటే ఏ సమయానికి వస్తారో? ఏ సమయానికి పోతారో ?తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.ఈ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రానికి చౌళ్ళరామారం చిర్రగూడూర్, చిన్నపటిశాల, జానకిపురం అనుబంధ గ్రామాలు ఉన్నాయి ఆయా గ్రామాలకు చెందిన ఆశా కార్యకర్తలు పల్లె దావఖానాకు వచ్చే రోగులకు ప్రజలకు అందుబాటులో సేవలందిస్తుంటారు.కానీ ఈ పల్లె దావకానకు ఇద్దరు హెల్త్ అసిస్టెంట్ల ఉన్నారు కానీ వీరు ఏ ఏ సమయాలలో వస్తారో తెలియదు వచ్చిన ఏ సమయం వరకు ఉంటారో ఏ సమయంలో వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది.గత కొన్ని రోజులుగా రోగులు అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు కొన్ని సందర్భాలలో 11  గంటల వరకు కూడా తాళాలు తీయరు ఇక్కడికి వచ్చిన రోగులు ఇబ్బందులు పడక తప్పడం లేదని ఆయా గ్రామాల ప్రజలు తెలియజేస్తున్నారు.అంటే ఇక్కడికి పై అధికారులు రారా లేదా వారి ఇది పై అధికారులు పట్టించుకోరా..అనే ప్రశ్న తలెత్తుతుంది.ఈ దవాఖాన వ్యవహారం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న వైద్య సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని ప్రజలు అక్కడికి వచ్చిన రోగులు తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇది ఇలా ఉండగా పేరుకే ఉపకేంద్రం శుభ్రత అన్న మాటే మార్చారు ఎటుచూసినా గడ్డి పిచ్చి మొక్కలతో ఆవరణ మొత్తం నిండి ఉంది ప్రహరీ గోడ లేకపోవడంతో పశువులు,కుక్కలు,జీవరాసులు ఉపకేంద్రంలోకి ప్రవేశిస్తున్నాయి అయినా అక్కడ సిబ్బంది. ఆరోగ్య ఉప కేంద్రం ఇక్కడ ఉందనే సంగతే మరిచారు.ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పవలసిన ఆరోగ్య సిబ్బంది ఆ మాటే మరిచారు.ఇప్పటికైనా పై అధికారులు స్పందించి ఉప కేంద్రానికి సంబంధించిన సిబ్బందినీ సరైన టైంలో వచ్చేటట్లుగా చూసి రోగులకు అందుబాటులో ఉండేలా చూడాలని అక్కడి గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333