ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ

Mar 12, 2025 - 19:51
 0  11
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ

జోగులాంబ గద్వాల 12 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: వడ్డేపల్లి . మండల కేంద్రంలోని శాంతినగర్ మున్సిపాలిటీ పరిధిలోని అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్ ఎ సంపత్ కుమార్  ఆదేశాల మేరకు పైలెట్ ప్రాజెక్టు కింద మండల కేంద్రంలోని తహసిల్దార్ ఆఫీస్ పక్కన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ భూమి పూజ కాంగ్రెస్ నాయకులు అధికారులు చేయడం జరిగినది.

    ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన వడ్డేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు బంగారు రామకృష్ణారెడ్డి అభివృద్ధి అంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధి మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వమని గడిచిన పది సంవత్సరాలు పేదలైన అర్హులందరికీ ఇల్లు ఇస్తామని  మోసము మాటలు చెప్పి అధికారం చేపట్టి పేదలైన అందరిని నిరుపేదలుగా చేశారని మండిపడ్డారు.

     ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి మండల డిప్యూటీ తహసిల్దార్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, వడ్డేపల్లి మండల అధ్యక్షులు బంగారు రామకృష్ణారెడ్డి, అల్లంపూర్ జోగులాంబ ఆలయ ధర్మకర్త రామాపురం జగన్ గౌడ్, ఆర్డీఎస్ మాజీ చైర్మన్ తనగల సీతారామరెడ్డి, జిల్లా కిసాన్ సెల్లు అధ్యక్షులు ఎనుముల నాగరాజు, రాష్ట్ర ఎస్సీ సెల్ జనరల్ సెక్రెటరీ వడ్డేపల్లి దేవేంద్ర, కాంగ్రెస్ నాయకులు నరసింహనాయుడు, జిల్లెడుదిన్నె శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333