అర్హులైన ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవాలి..
అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకే వార్డు సభలు..
31 వ వార్డు సభలో అదనపు కలెక్టర్ పి రాంబాబు..
సూర్యాపేట. 24 జనవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- అర్హులైన నిరుపేదలు ప్రతి ఒక్కరు ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు దరఖాస్తులు చేసుకోవాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలకు అర్హులను ఎంపిక చేసే క్రమంలో జిల్లా కేంద్రంలోని 31వ వార్డులో నిర్వహించిన వార్డు సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అధికారులు చదివిన జాబితాలో పేర్లు లేని వారు మరల దరఖాస్తు చేసుకోవాలని అన్నారు. ఈ దరఖాస్తుల ప్రక్రియ ఒక్క రోజుతో ఆగదని నిరంతరం కొనసాగుతుందని అందరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వార్డు కౌన్సిలర్ కొండపల్లి నిఖిల దిలీప్ రెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వార్డులో నిజమైన అర్హులను గుర్తించే అందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. జాబితాలో పేర్లు లేని వారు మరల దరఖాస్తులు చేసుకుంటే అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. అనంతరం ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కొండపల్లి దిలీప్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు జావీద్,వార్డు అభివృద్ధి అధికారిని కవిత,జ్యోతుల శ్రీనివాస్, ఇందిరమ్మ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.