అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా డ్రోన్ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించిన
గద్వాల మున్సిపల్ చైర్మన్ శ్రీ బి.యస్.కేశవ్
జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్
జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో అమృత్ 2.0 కార్యక్రమంలో భాగంగా జి.ఐఎస్.బేస్ మ్యాప్ తయారు చేయుటకు డ్రోన్ సర్వే ద్వారా సెంట్రల్ సర్వే డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు మరియు గద్వాల మున్సిపల్ చైర్మన్ శ్రీ బి.యస్.కేశవ్,జిల్లా కలెక్టర్ బి.యం సంతోస్ ఆధ్వర్యంలో డ్రోన్ సర్వే కార్యక్రమాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిటిసిపి అడిషనల్ డైరెక్టర్ రమేష్ బాబు,సంబంధించిన అధికారులు,కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీ కౌన్సిలర్స్ గద్వాల టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.