అడ్డగూడూరు లో వార్డు మెంబర్లకు శిక్షణ అవగాహన సదస్సు
అడ్డగూడూరు 02 మార్చి 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 17 గ్రామాల వార్డు మెంబర్లు కు శిక్షణ తరగతులు ఎంపీడీవో శంకరయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. శిక్షణ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి మాస్టర్ ట్రైనర్స్ శ్రీశైలం,రమేష్, జనరంజన్,17 గ్రామాల సంబంధిత గఉపసర్పంచ్ లు,వార్డ్ మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు,తదితర అధికారులు పాల్గొన్నారు.