అంబేద్కర్ విగ్రహం చుట్టూ బునాది ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలి

Jun 28, 2025 - 19:17
 0  41
అంబేద్కర్ విగ్రహం చుట్టూ బునాది ధ్వంసం చేసిన వారిని వెంటనే శిక్షించాలి

-ఎం ఆర్ పి యస్ మండల అధ్యక్షులు సురారం రాజు మాదిగ
అడ్డగూడూరు 28 జూన్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని గోవిందపురం గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహం చుట్టూ గార్డెన్ కోసం నిర్మించిన గనైట్ రాయి బునాదిన్ని తొలగించడంతో ఎం.ఆర్.పి.ఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు పద్మశ్రీ మంద క్రిష్ణ మాదిగ ఆదేశానుసారం ఎం ఆర్ పి ఎస్ మరియు దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘటన స్థలాన్ని పరిశీలించడం జరిగింది.ఈ సందర్బంగా ఎం.ఆర్.పి.ఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ మాట్లాడుతూ.. బునాది రాయిని ధ్వంసం చేసి ఘటనకు పాల్పడిన దుండగులపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో ఎం.ఆర్.పి.ఎస్ మరియు దళిత ప్రజాస్వామిక సంఘాలతో పెద్ద ఎత్తున ధర్నాలు నిరసనలు చేపడుతామని హెచ్చరించారు. 


ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.పి.ఎస్ మాజీ మండల అధ్యక్షులు గజ్జెల్లి రవిమాదిగ, గూడెపు బాబు అడ్వకేట్ ఎం.ఆర్.పి.ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్ మాదిగ, బాలెంల అయోధ్య,సీనియర్ నాయకులు మేకల ఇమ్మానుయేల్,బాలెంల మల్లయ్య బోడ ఎల్లయ్య గజ్జెల్లి క్రిష్ణ,గూడెపు సురేష్,కిరణ్,ఉమేష్,చెడిపెల్లి అంజయ్య,బోనాల మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333