సాతర్ల గ్రామంలో వైద్య శిబిరం
జోగులాంబ గద్వాల 10 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- DM&HO జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జె. సoద్యా కిరణ్మయి ఆదేశాల మేరకు ఈరోజు ఇటిక్యాల PHC పరిధిలోని సాతర్ల గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించడమైనది. వైద్యాధికారి ఆధ్వర్యంలో ANM, MLHP, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్‌ల బృందం గ్రామాన్ని సందర్శించి ప్రజలకు వైద్య సేవలు అందించారు. అందులో ఓపి 53 బీపీ షుగర్ వారికి శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది. డయాలసిస్ వారు ఆరుగురు వచ్చి వివరాలు తెలియజేశారు...
ఈరోజు నిర్వహించిన సేవలు:
1. OP సేవలు:53_ మందికి ఉచితంగా వైద్య పరీక్షలు, మందులు అందజేశారు.
2. బీపీ పరీక్షలు 25 మందికి రక్తపోటు పరీక్షలు చేశారు.
3. షుగర్ పరీక్షలు: 18 మందికి రాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలు నిర్వహించారు.
4. డయాలసిస్ పేషెంట్లు: గ్రామంలో డయాలసిస్ చేయించుకుంటున్న వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి, తగు సూచనలు, కౌన్సెలింగ్ ఇచ్చారు.
5. మూత్రపిండాల పరీక్షలు: 23 మందికి అనుమానితులకు యూరిన్, క్రియాటినిన్ పరీక్షల నిమిత్తం నమూనాలు సేకరించారు.
ముఖ్య గమనిక: గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రేపు అనగా 11-06-2026 న కూడా సాతర్ల గ్రామంలో వైద్య పరీక్షలు కొనసాగించబడును.
కావున సాతర్ల గ్రామ ప్రజలు, ముఖ్యంగా 30 సంవత్సరాలు నిండిన వారు, బీపీ, షుగర్, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు రేపు ఉదయం 9:00 గంటల నుండి గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన వైద్య శిబిరానికి హాజరై ఉచిత పరీక్షలు చేయించుకోవలసిందిగా కోరడమైనది.
స్థలం: గ్రామ పంచాయతీ, సాతర్ల
సమయం: ఉదయం 9:00 నుండి సాయంత్రం 4:00 వరకు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని DM&HO మరియు ఇటిక్యాల వైద్య ఆరోగ్యశాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.